Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌కళ్యాణ్‌ ఎంతమందికి ఆశ పెడ్తాడు?

పవన్‌కళ్యాణ్‌ ఎంతమందికి ఆశ పెడ్తాడు?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు స్టార్‌గా శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాడు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు ఇక ఎన్నో సినిమాలు చేయనని పవన్‌ ప్రకటించడంతో అతను చేసే ఆ కొన్ని చిత్రాల్లో తమది కూడా ఉండాలని నిర్మాతలు తొందర పడుతున్నారు. అయితే అత్తారింటికి దారేది తర్వాత పవన్‌ ఇంతదాకా సోలో హీరోగా నటించలేదు.

గోపాల గోపాల కోసం ఒక పాతిక రోజులు షూటింగ్‌ చేయడం మినహా అతను సినిమాల పరంగా గత ఏడాదిన్నర కాలంగా చేసిందేమీ లేదు. గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ ఎప్పుడు మొదలవుతుందనేది తెలీదు. పివిపితో సినిమా ఉంటుందని ఏనాడో ప్రకటించినా అది ఎప్పుడు సెట్స్‌ మీదకి వెళుతుందనేది పవన్‌కే తెలియాలి. 

ఆమధ్య గోపాల గోపాల దర్శకుడు డాలీతో సినిమా చేసేస్తానని కూడా పవన్‌ చెప్పాడు. అతను ఆ ఆశలతోనే కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. తాజాగా దాసరి నారాయణరావుకి కూడా తన బ్యానర్‌లో సినిమా చేస్తానని పవన్‌ మాట ఇచ్చాడట. ఇది ఎప్పటికి తెర రూపం దాలుస్తుందో కనీసం దాసరికి అయినా తెలుసో లేదో? అడిగిన వాళ్లకి కాదనకుండా అభయం ఇచ్చేస్తున్న పవన్‌ నిజంగా ఈ ప్రామిస్‌లన్నీ నిలబెట్టుకుని ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తే ఫాన్స్‌కి పండగే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?