మార్చి నుంచి మే వరకు.. టాలీవుడ్ కు పీక్ సమ్మర్ సీజన్. పెద్ద సినిమాలకు ఇదో మంచి అట్రాక్షన్. ఈ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో వున్న రెండు సినిమాల్లో ఒకటి అయినా వస్తుందా? ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు రెండూ సగానికి పైగా రెడీ అయి వున్నాయి. దాదాపు ఏడెనిమిది నెలల నుంచీ ఈ సినిమాలది ఇదే పరిస్థితి.
కొన్నాళ్ల క్రితం మంగళగిరి ప్రాంతంలోనే సెట్ వేసి ఓ షెడ్యూలు చేసారు హరి హర వీరమల్లు సినిమాకు. ఓజీకి అయితే అదీ లేదు. ‘హీరో లేని సీన్లు’ అనే కొత్త కాన్సెప్ట్ ప్రకారం షూట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓజీ దర్శకుడు సుజిత్ తన తరువాత సినిమా మీద వర్క్ చేసుకుంటున్నారు.
నిజానికి ఈ రెండు సినిమాలకు మార్చి లోనే విడుదల అంటూ డేట్ లు ఇచ్చి వున్నారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఏ ఒక్క సినిమా కూడా మార్చిలో వచ్చేలా లేదు. రెండు సినిమాల మీద కూడా పవన్ కళ్యాణ్ చెరో ఇరవై రోజులు వర్క్ చేయాల్సి వుంది. కనీసం క్లోజ్ లు అన్నీ తీసుకోవాలి. జనవరిలో ఈ ఫీట్ పాజిబుల్ అయితేనే మార్చిలో విడుదల సాధ్యం అవుతుంది. జనవరి అంతా పండగ హడావుడి, సెలవులతో గడిచిపోతుంది. ఇక మిగిలింది ఫిబ్రవరినే.
ఫిబ్రవరిలో ఏ సినిమాకు ఇరవై రోజులు డేట్స్ ఇచ్చినా కూడా మార్చిలో సినిమా అన్నది చాలా వరకు కష్టమే. అదే కనుక ఫిబ్రవరిలో కూడా డేట్ లు ఇవ్వకపోతే ఏప్రియల్ లో రావడం కష్టం అవుతుంది. అసలు ఓజీ అనే పేరు వింటేనే చికాకుపడుతున్నారు పవన్. ఇదంతా చూస్తుంటే పవన్ కు సినిమాను కంప్లీట్ చేసే అలోచన వున్నట్లు కనిపించడం లేదు. అందువల్ల ఈ సమ్మర్ లో పవన్ సినిమా వస్తుందా అన్నది అనుమానమే.
no
First,Veedu poyi aa 30,000 women missing annadu kada …cinema enduku veediki …vallani pttukommanu..anthavaraku aadangi laa undamanu..bongulodi cinema veshalu veedu