అన్నను చూస్తారా? ‘హరీష్’?

గతంలో మాదిరిగా వరుణ్ తేజ్ తో ఓ రీమేక్ అందుకోవాలి. ఇక హరీష్ డైరక్షన్ లో అన్నను చూడడం మాత్రం కలే కావచ్చు.

ఇప్పటి దాకా తమ్ముడిని చూసారు. ఇప్పుడు అన్నను చూస్తారు. ఈ డైలాగు మెగా ఫ్యాన్స్ కు గుర్తుండే వుంటుంది. గతంలో ఓ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మెగాస్టార్ ను మీరు ఎలా చూపించబోతున్నారు అనే ప్రశ్నకు దర్శకుడు హరీష్ శంకర్ సమాధానం.

అప్పట్లో మెగాస్టార్-హరీష్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని తెగ గ్యాసిప్ లు వచ్చాయి. పవన్ తో తెరి రీమేక్ ఉస్తాద్ చేస్తారు. దాని తరువాత మెగాస్టార్ సినిమా అనుకున్నారు. గట్టిగా వారం రోజులు షూట్ చేయకుండానే, గ్లింప్స్ అంటూ నానా హడావుడి చేసారు. ఎన్నికల ముందు జనసేనకు పనికి వచ్చేలా ఇలాంటి గ్లింప్స్ చాలా వదిలారు.

కట్ చేస్తే హరీష్ శంకర్ అందించిన మిస్టర్ బచ్చన్… చరిత్రలో మిగిలిపోయే డిజార్డర్ గా మారింది. ఉస్తాద్ సినిమా అసలు వుంటుందో, వుండదో తెలియని పరిస్థితి. మెగాస్టార్ తో సినిమా నమ్మకం కూడా వమ్మయిపోయినట్లే. హరీష్ ప్రతిభ మీద మెగాస్టార్ కు నమ్మకాలు సడలిపోయాయి. ఇప్పుడు మెగాస్టార్ ఓ సినిమాను అనిల్ రావిపూడితో చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరువాత సినిమా బాబీతో చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ పూర్తయ్యే సరికి మరో ఏడాదికి పైగానే పడుతుంది. అప్పటి వరకు హరీష్ శంకర్ ఖాళీగా వుండాలి. లేదా మళ్లీ గతంలో మాదిరిగా వరుణ్ తేజ్ తో ఓ రీమేక్ అందుకోవాలి. ఇక హరీష్ డైరక్షన్ లో అన్నను చూడడం మాత్రం కలే కావచ్చు.