అమెరికా: ‘మాగా’ క్యాంపులో మనస్పర్ధలు

ప్రమాణసీకారానికి ముందు ట్రంప్ చేసిన మూడు నియామకాలు రిపబ్లికన్లకి మింగుడుపడడంలేదు.

MAGA (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) నినాదంతో పోరాడిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నెగ్గాడు. జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.

అసలు డొనాల్డ్ ట్రంప్ ని అక్కడి జనం గెలిపించడానికి ముఖ్యకారణాల్లో ఒకటి ఇమిగ్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించి అక్రమవలసదారుల్ని తోలేస్తాడని, సక్రమ వలసదారుల్ని కూడా కట్టడి చేసి స్థానికులకి ఉద్యోగాలిస్తాడని. మాగా నినాదంతో చేసిన ప్రచారంలో చెప్పిన విషయాలు కూడా ఇవే.

కానీ ప్రమాణసీకారానికి ముందు ట్రంప్ చేసిన మూడు నియామకాలు రిపబ్లికన్లకి మింగుడుపడడంలేదు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, శ్రీరామ కృష్ణన్…ఈ ముగ్గుర్నీ నిఖార్సైన అమెరికన్స్ అనడానికి లేదు.

ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన వ్యక్తి. హెచ్ 1 బీ మీద అమెరికాకి వచ్చి స్థిరపడినవాడు. వివేక్ రామస్వామి తల్లిదండ్రులు ఇండియా నుంచి హెచ్ 1 బి తీసుకుని మైగ్రేట్ అయిన వాళ్లు. అధ్యక్షుడికి ఎ.ఐ అడ్వైజర్ గా నియమితుడైన శ్రీరాం కృష్ణన్ చెన్నైలో పుట్టి పెరిగి అమెరికాకి హెచ్ 1 బీ మీద వచ్చినవాడు. ఈ ముగ్గురూ పొలిటీషియన్స్ కారు. కానీ డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కంటే ఇండియన్స్ కి ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఈ మూడే.

ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. అతను చెప్పినట్టు దేశం నడుచుకోవాలన్నట్టుగా ఉంది అతని ధోరణి. ట్రంప్ కూడా ప్రస్తుతానికి మస్క్ పట్ల ఉదాశీనంగానే ఉన్నాడు. అతను కూడా స్వతహాగా పెద్ద వ్యాపారి. కనుక వ్యాపార ధోరణి తర్వాతే ఏ సెంటిమెంటైనా అన్నట్టుంది ట్రంప్-మస్క్ ద్వయానికి.

ఏ దేశంలో అయినా పొలిటీషియన్ ముందు కనిపిస్తూ, వెనుక పారిశ్రామికవేత్తలు, కుబేరులు ఉండడం కామన్.. మనకి నరేంద్ర మోదీ వెనుక అదానీలు, అంబానీలు ఉన్నట్టు. దానికి రివర్సులో ఉంది అమెరికా పరిస్థితి. ఎలాన్ మస్క్ ముందు కనిపిస్తూ ట్రంప్ అతని పక్కనో, వెనకో అన్నట్టుగా ఉంది.

ఇంతకీ తాజా విషయమేంటంటే ఎలాన్ మస్క్ కి, మాగా క్యాంపులో ఉన్న హార్డ్ కోర్ రిపబ్లికన్లకి పడడంలేదు. మస్క్ హెచ్ 1 బీ ని స్క్రాప్ చెయ్యాలనే ఆలోచనకు సుముఖంగా లేడు. కానీ రిపబ్లికన్లకి మాత్రం దానిని స్క్రాప్ చేసేయాలన్నంత కసిగా ఉంది.

తన స్పేస్ ఎక్స్, టెస్లా కూడా ప్రతిభావంతులైన హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ వల్ల ఎదిగాయని, ట్యాలెంట్ ఎక్కడున్నా అమెరికా లాక్కోవాలని, హెచ్ 1 బీ లేకపోతే అమెరికా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని మస్క్ వాదిస్తున్నాడు.

దీనికి రిపబ్లికన్లు చాలామంది, “అలా అంటే అది మాగా స్ఫూర్తికి విరుద్ధం కదా” అన్నారు.

దానికి మస్క్ “ఎఫ్” పదం వాడుతూ కటువైన పోస్ట్ పెట్టాడు.

“రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ” అన్నట్టుగ్గా, రిచ్ మ్యాన్ ఏ బూతు పదం వాడినా దానిని పెద్దగా ఆక్షేపించేవాళ్లు ఉండరని తేలింది.

“ఇది అమెరికా ఫస్ట్ ఆపరేషన్ లా లేదు. ఇండియా ఫస్ట్ ఆపరేటివ్ లా ఉంది” అని కూడా సోషల్ మీడియాలో రిపబ్లికన్లు పోస్టులు పెడుతున్నారు.

దీనికి కూడా ఎలాన్ మస్క్ ఘాటైన స్పందన ఇచ్చాడు.

“రిపబ్లికన్ పార్టీలో ఎవరైనా రేసిస్ట్ మాటలు మాట్లాడితే పార్టీలోంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది” అన్నాడు.

జరగబోయేది ఏమిటో చూడాలి కానీ, ప్రస్తుతానికైతే రిపబ్లికన్ ఓటర్లు ఏది ఆశించి ట్రంప్ ని గెలిపించారో దానికి భిన్నంగా జరుగుతోందేమో అన్న సందేహంలో ఉన్నారు.

అమెరికన్స్ కి ఉద్యోగాల రీత్యా ప్రధానమైన కాంపిటీషన్ భారతీయులు. వారిని కట్టడి చేస్తే ఆ ఉద్యోగాలు తమకి వస్తాయన్న లెక్కలో ఉన్నారు. కానీ ట్యాలెంటున్నవాళ్లని మాత్రం హెచ్ 1 బీ ద్వారా అమెరికా స్వాగతిస్తూనే ఉంటుందంటున్నారు ట్రంప్, రామస్వామిలు. ట్యాలెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటే అమెరికన్ల దృష్టిలో భారతీయులే. ఈ లెక్కన బైడెన్ పాలనకి ట్రంప్ పాలనకి తేడా ఏమిటి అని యోచనలో పడుతున్నారు.

బైడెన్ పాలనంత ఉదాశీనంగా కాకుండా, కఠినమైన పద్ధతిలో ప్యూర్ ట్యాలెంటునే విదేశాల నుంచి తీసుకుంటామని చెబుతున్నా కూడా అమెరికన్లకి నమ్మకం కలగడంలేదు. అమెరికన్ల ట్యాలెంటుని వెక్కిరిస్తున్నారంటూ రిపబ్లికన్లు గోల చేస్తున్నారు.

ఏది ఏమైనా అమెరికా పరిపాలన ఎన్నిక కాని మస్క్ చేతిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ పేరుకే తప్ప పూర్తిగా మస్క్ చెప్పినట్టు నడుచుకుంటాడేమో అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇక్కడొకటి చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ తొలుత ట్రంప్ వ్యతిరేకి. “ఆ వృద్ధుడు గెలిచి పాలించేది ఏముంటుంది”..అని వెక్కిరించినవాడే. కానీ ఏమయ్యిందో ట్రంపుతో సయోధ్య కుదిరింది. కన్వెర్టెడ్ రిపబ్లికన్ అయిపోయాడు.

ఒక పక్క అమెరికన్ మార్కెట్ పైకి లేవడం, బిట్ కాయిన్ వాల్యూ పెరగడం వంటివి శుభసూచకాలే అయినా ఇమిగ్రేషన్ విషయంలో మాత్రం “మాగా” క్యాంపులో అంతర్గత విభేదాలు పొడచూపుతున్నాయి. వీటిని ట్రంప్ గారు ఎలా గట్టెక్కిస్తారో, అటు అమెరికన్లకి ఇటు భారతీయులకి ఉభయకుశలంగా ఏ విధానాలు తీసుకొస్తారో చూడాలి.

– పద్మజ అవిర్నేని

9 Replies to “అమెరికా: ‘మాగా’ క్యాంపులో మనస్పర్ధలు”

  1. ముందుగా తెలంగాణ వాళ్ళని ఏ దేశంలో ఉన్న వెళ్ళగొట్టాలి ..వాళ్ళు కోరుకున్న నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదానికి కట్టుబడి వెళ్లకుంటే ఈ చీడపురుగుల్ని కొట్టుకుంటూ తరిమేయాలి

  2. Papam padmaja Garu Baga feel ayyinattunnaru. Intha Kalam aha trump oho trump Ani bakalu oodaru. Most probable reason andaroo US rakudadu ane previous generation immigrants mindset. Because if everyone is in America then you guys will not be special anymore.

  3. నేను గ్రాడ్యుయేట్ స్కూల్లో ఉన్నప్పుడు(21) ఒక 60 ఏళ్ల learned తెల్ల అమెరికన్తో క్యాజువల్ డిస్కషన్:

    Me: Well, its too bad we don’t have much well paying union jobs these days (in 2005)

    Him: వాటి గురించి నువ్వు అంత బాధపడకు

    Me: Why? Loss of good paying jobs is not something to be concerned about?

    Him: నువ్వు చెప్పే అటువంటి మంచి జీతం సామాన్య జనం సమిధలు అవ్వటం వల్ల వచ్చిందే

    Me: ????? (Question Mark face, అర్థం కాలేదు అన్నట్టు చూసా)

    Him: వాళ్లు 60’s, 70’s లో చేసిన అరాచకాలు నీకు తెలీదు, అన్ని ఇన్ని కాదు నువ్వు అప్పటికి పుట్టి వుండవు కూడా. అలాంటి జాబ్స్ వుండటం కన్నా వూడటమే మంచిది. ఇప్పటికీ ఇంకా అక్కడక్కడా కొన్ని ఉన్నాయి, వాటి మీద ఒక కన్నేసి ఉంచు నీకే అర్థం అవుతుంది. They have nothing to blame but for themselves.

    Eye opener for me, reinforced me to use brain. వినదగు నెవ్వరు చెప్పిన…….సుమతీ

  4. పెపంచెకం లో ఎక్కడైనా కూడా డబ్బు, పరపతి వున్నవాడు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది.

    క్రోనీ క్యాపిటలిజం పుట్టుగడ్డ అయిన అమెరికా లో ఇంకా మరీను.

    మోరల్, నీతి కథలు, రూల్స్ అన్ని కూడా మిగతా జనాలని అదుపులో పెట్టడానికి చెప్పే మాటలు.

    మనము గొప్పో మనిషి గా చెప్పుకునే టాటా కి కూడా వ్యాపార పరంగా అనేక బయటకి చెప్పని మార్గాలు, పద్ధతులు వున్నాయి. 100% స్వచ్చత తో ప్రపంచ కుబేరులు కావడం అసాధ్యం, ఏదో ఒక బయటకి చెప్పని పనులు చేస్తే తప్ప.

Comments are closed.