పవన్ కు వలేస్తున్న భీమినేని

సుస్వాగతం లాంటి హిట్, అన్నవరం లాంటి ఫ్లాపును పవన్ కు చవిచూపించిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే అప్పటి సంగతి వేరు ఇప్పటి పవన్ ఇమేజ్ వేరు. ఎంత సుడిగాడి లాంటి స్పూఫ్ లతో…

సుస్వాగతం లాంటి హిట్, అన్నవరం లాంటి ఫ్లాపును పవన్ కు చవిచూపించిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే అప్పటి సంగతి వేరు ఇప్పటి పవన్ ఇమేజ్ వేరు. ఎంత సుడిగాడి లాంటి స్పూఫ్ లతో హిట్ కొట్టినా భీమినేనిని పవన్ దగ్గరకు మరోసారి తీస్తాడా అన్నది అనుమానం. 

అయినా రీమేక్ లను నమ్ముకునే భీమినేని, ఇటీవల పవన్ కు సూటయ్యే ఓ సినిమాను కనిపెట్టి, కొనిపెట్టి వుంచాడని తెలిసింది. సుందర్ అండ్ కో ద్వారా మంచి హిట్ కొట్టి, రెండు హిట్ లు కొట్టాను కనుక, ఈ సబ్జెక్ట్ తీసేందుకు అవకాశం ఇవ్వమని పవన్ ను అడగాలన్నది భీమినేని ప్లానట. 

మరి ఇది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి. అయినా పవన్ ది కాస్త డిఫరెంట్ వ్యవహారం. అవకాశం ఇచ్చినా ఇచ్చేస్తాడు,.