ఒకమ్మాయికి పెళ్ళయ్యిందంటే తల్లి తండ్రులకు పెద్దభారం దిగిపోతుంది. అదే హీరోయిన్‌కు పెళ్ళయితే ప్రేక్షకులకు కూడా బోలెడన్ని భ్రమలు తొలగిపోతాయి. ‘బెజవాడ’ సినిమాతో స్ట్రెయిట్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో నిరాశ పర్చిన అమలాపాల్‌కు ఇటీవలే పెళ్ళయ్యిందీ.. హనీమూన్ గట్రా ముగించుకొని మళ్ళీ వచ్చి పెండింగ్ సినిమాలు పూర్తి చేసే పనిలో పడిందట.
అయితే పెళ్ళయ్యాక అమలాపాల్‌లో కన్పిస్తున్న గ్లో చూసి, ఆమెతో సినిమాలు చేస్తున్న దర్శకులు మురిసిపోతున్నారట. గతంలో డస్కీగా, డల్‌గా కనిపించిన అమలాపాల్ ఇప్పుడు రిలాక్స్‌డ్‌గా కూల్‌గా కొత్తదనంతో కన్పించడం తమ సినిమాలకు ప్లస్ అవుతుందని లైట్ మేకప్‌తో షూటింగ్స్ చేస్తున్నారట.
అమలాపాల్ కూడా గతంలోలా ప్రతి విషయానికీ చిర్రుబుర్రులాడకుండా నిదానంగా చెప్పినట్లు చేస్తుందట. పెళ్ళయితే ఇన్ని కొత్త అందాలూ, కొత్త లక్షణాలూ వస్తాయని చాటి చెప్పిన అమలాపాల్‌ను మెచ్చుకోవాల్సిందే.