మొత్తానికి మిర్చి తరువాత పెద్ద సినిమా అది కూడా మహేష్ తో చేయాలన్న దర్శకుడు కొరటాల శివ కోరిక నెరవేరబోతోంది. వచ్చే నెల 11న వీరిద్దిరి కాంబినేషన్ లో నిర్మించే సినిమా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ముహుర్తం లాంఛనమే. అసలు షూటింగ్ మరో నెల తరువాత సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది.
ఆగడు సినిమా వ్యవహారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అవి పూర్తయ్యేవరకు మహేష్ ఖాళీ కాడు. అందుకే ముహుర్తం కోసం వచ్చేనెల క్లాప్ కొట్టేసి, సెట్ పైకి మరోనెల ఆలస్యంగా వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. పైగా అదే నెలలో ఆగడు విడుదల కూడా వుంది. ఇటు రిలీజ్..అటు షూటింగ్ అన్నమాట.
ఈ స్క్రిప్ట్ పై కొరటాల చాలా నమ్మకంగా వున్నాడు. పైగా వచ్చిన గ్యాప్ ను వాడుకుని, బౌండ్ స్క్రిప్ట్ ను పకడ్బందీగా తయారుచేసేనట్లు సమాచారం. దీని పట్ల కూడా మహేష్ చాలా హాపీగా వున్నాడట. సో…మరో క్రేజీ ప్రాజెక్టు రెడీ అవుతున్నట్లే..2015నాటికి.