ఆడపిల్లకు పెళ్లి జరగాలి అదికూడా యుక్త వయసులోనే. ఆలస్యమైతూ అన్నీ ప్రశ్నలే. ఇక హీరోయిన్‌కు పెళ్లెప్పుడవుతుందంటే చెప్పడానికి జ్యోతిష్యులు కూడా భయపడిపోతారు. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి ప్రస్తావన లేదని చెబుతుంది అందాల శృతిహాసన్.
నేను హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది నిన్ననే. అప్పుడే పదిహేనేళ్లు అయిపోయినట్లు పెళ్లెప్పుడు అంటే నేనేమీ చెప్పను. పోనీ అర్జంటుగా పెళ్లాడడాని నేను ఎవ్వరినీ ప్రేమించడమూ లేదు కాబట్టి తొందరెందుకు.. నేనింకా పోషించాల్సిన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ముందు నన్ను సంపూర్ణ నటిగా ఎదగనివ్వండి. ఎప్పుడైతే ప్రేక్షకులు నన్ను రిజెక్ట్ చేస్తారో అప్పుడు ఆలోచ్చివచ్చు అంటున్న శృతిహాసన్ గొప్ప నటి.
ఇప్పుడు మంచి పొజీషన్లో ఉంది. ఇలాగే ఇంకో ఆరేళ్లు కంటిన్యూ చెయ్యగల సామర్ధ్యం ఆమెకుంది. కాబట్టి పెళ్లి ప్రస్థావన గురించి అడగడం దండగ. నటన, పాటలూ, రచనలూ ఎడాపెడా చెయ్యడానికి రెడీ అయిన శృతిహాసన్ ఇప్పుడప్పుడే ఇండస్ట్రీని వదలదు. ఆవిడ పెళ్లితో పనేంటి. నటన, గ్లామర్ని ఆస్వాదిస్తే చాలు కదా.