తమిళంలో సలీంగా వచ్చిన సినిమా ఇప్పుడు తెలుగునాట డాక్టర్ సలీమ్ గా వస్తోంది. సకలకళావల్లభన్ (రచయిత, కవి, సంగీతం దర్శకుడు, నటుడు) లాంటి విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమా ఇది. టెంపర్ సినిమా మాదిరిగానే ఓ అమ్మాయిని నలుగురు కుర్రాళ్లు రేప్ చేసి, చంపేస్తే, ఓ డాక్టర్ ప్రతిస్పందన. టెంపర్ కన్నా ముందే వచ్చింది తమిళంలో.
భారతీరాజా అసోసియేట్ నిర్మల్ కుమార్ రూపొందించాడీ సినిమాను. తాను స్వయంగా హీరోగా నటిస్తూ, సంగీత దర్శకత్వం వహించి, నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు విజయ్ ఆంటోని. తెలుగులోకి అనువందించిన ఈ సినిమాను యూనిట్ సభ్యులు, కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం రాత్రి వీక్షించారు.
మంచి మెసేజ్ ను జోడించి థ్రిల్లర్ గా రూపొందించిన తీరు బాగుందని వీరు అభిప్రాయ పడ్డట్టు వినికిడి. సినిమా తొలి సగం కాస్త నెమ్మదిగా సాగినా, ద్వితీయార్థం ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోపెడుతుందని చూసిన వారు చెబుతున్నారు. ప్రేక్షకుడు ఎలా ఫీలవుతాడో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.