రిలీజ్‌ లేటయ్యి నష్టపోయిన హీరోయిన్‌

ఆలస్యం అన్నివిధాలా నష్టం కలిగిస్తుందని తెలిసినవాడు కనుకే నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని చెప్పాడు ఆరుద్ర. ఆ సినిమా సకాలంలో రిలీజయ్యి ఉంటే నేను ఇంకొన్ని సినిమాలు చేసి ఉండేదాన్నని…

ఆలస్యం అన్నివిధాలా నష్టం కలిగిస్తుందని తెలిసినవాడు కనుకే నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని చెప్పాడు ఆరుద్ర. ఆ సినిమా సకాలంలో రిలీజయ్యి ఉంటే నేను ఇంకొన్ని సినిమాలు చేసి ఉండేదాన్నని చెబుతుంది సెక్సీతార సయామీఖేర్‌ వైవియస్‌ చౌదరి నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘రేయ్‌’ సినిమా హీరోయినే సయా మీఖేర్‌. 

ఎప్పుడో రెండేళ్ల క్రితం సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా ప్రారంభమైన ఆ సినిమా ల్యాబ్‌లోనే మురిగిపోయింది. ఆ హీరో రెండో సినిమా రిలీజయ్యి కూడా సంవత్సరం దాటేస్తుంది. ‘రేయ్‌’ సినిమా ఖచ్చితంగా మార్చి నెలలో రిలీజవుతుందని వస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ఆ సినిమా లేటవ్వడం వల్ల అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన సయామీఖేర్‌కు ఎంతో నష్టం జరిగిందనేది సత్యం. 

అప్పట్లో ఎంతో మంది నిర్మాతలు సయామీఖేర్‌ స్టిల్స్‌ చూసి తమ సినిమాల్లో పెట్టుకోవాలని ఉబలాటపడ్డారట. సినిమా రిలీజ్‌ అవ్వకుండా ఇతరత్రా సినిమాల్లో చెయ్యకూడదనే కండీషన్‌ కారణంగా ఆమెను వదులుకున్నారట. ఇంకొంత మంది అయితే సినిమ రిలీజై, తెర మీద ఆమె ఫెర్‌ఫార్మెన్స్‌ని స్వయంగా చూసి ఆ తర్వాత బుక్‌ చేసుకుందాం అనుకున్నారట.

 అలా ఎన్నో విధాలుగా నష్టపోయిన సయా మీఖేర్‌ ప్రఖ్యాత నటీమణి షబానా ఆజ్మీ మేనకోడలట. పాదరసమంత గ్లామర్‌ ఒలకబోసే సయామీఖేర్‌కు మంచి రోజులు వస్తాయో లేదో ఆగి చూడాల్సిందే.