పొలిటికల్‌ తెరపై ఉదయభాను.?

మొన్నామధ్య బుల్లితెర నటి ఉదయభాను, రాజకీయాల్లోకి వస్తుందంటూ చాలా ప్రచారమే జరిగింది. అప్పట్లో ఆమె పాడిన ఓ పాట, ఆమెను రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. ఉదయభానుపై కొందరు రాజకీయ నాయకులు గుస్సా అయ్యారు. ఆమె…

మొన్నామధ్య బుల్లితెర నటి ఉదయభాను, రాజకీయాల్లోకి వస్తుందంటూ చాలా ప్రచారమే జరిగింది. అప్పట్లో ఆమె పాడిన ఓ పాట, ఆమెను రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. ఉదయభానుపై కొందరు రాజకీయ నాయకులు గుస్సా అయ్యారు. ఆమె తన పాటలోని ఆవేదనను అర్థం చేసుకోవాలే తప్ప, దానిని రాజకీయం చేయొద్దంటూ విన్నవించుకుంది కూడా.

సినీ, బుల్లితెర రంగం నుంచి రాజకీయాల్లోకి చాలామంది వచ్చారు, వస్తూనే వున్నారు. ఆ కోవలో బోల్డంత అభిమాన గణం వున్న ఉదయభాను కూడా రాజకీయాల్లోకి రావొచ్చన్న ప్రచారం మళ్ళీ షురూ అయ్యిందిప్పుడు. ఎన్నికల వేళ, ఉదయభాను ఈ గాసిప్స్‌పై ఎలా స్పందిస్తుందోగానీ, బీజేపీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని మరో గాసిప్‌ తెరపైకొచ్చింది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉదయభానుని తమ పార్టీలో చేర్చుకుంటే ఎలా వుంటుందన్న విషయమై వివిధ రాజకీయ పార్టీలూ సమాలోచనలు చేస్తున్నాయట. ఈ విషయం ఉదయభానుదాకా వచ్చిందో లేదో మరి.!