మెగా క్యాంప్ వాళ్ల ఫంక్షన్లు ఎప్పుడు జరిగినా కామన్ విషయం ఒకటి వుంది. పవర్ స్టార్..పవర్ స్టార్ అంటూ కేకలు. ఈ సారి బ్రూస్ లీ అడియో ఫంక్షన్ లో ఆ సందడి లేదు. ఎవరూ పెద్దగా పవర్ స్టార్ గురించి పట్టించుకోలేదు. ఆ మధ్య చిరు షష్టిపూర్తి ఫంక్షన్ లో అభిమానులు ఇదే విధంగా గోల చేసినపుడు నాగబాబు ఎమోషన్ అయి, పవర్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మరి ఆ మంత్రం పని చేసిందని అనుకోవాలి. లేదా అభిమానులకు పాస్ లు ఇవ్వడంలో కాస్త జాగ్రత్త పడ్డారో మరి. ఇదిలా వుంటే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ తప్ప మరెవరు ఫంక్షన్ కు హాజరు కాలేదు. పవర్ స్టార్ ఎలాగూ రాడు. నాగబాబు కూడా రాలేదు. వరుణ్ తేజ కూడా రాలేదు. చిరంజీవి భార్య, కుమార్తె, కోడలు హాజరయ్యారు.