పవన్‌కళ్యాణ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరమైపోయాడనేది జగద్విదితం. మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవికే అండగా నిలవడంతో పవన్ తన కుటుంబంలో ఒంటరి అయిపోయాడు. పవన్ ఇలా చేయడాన్ని మిగతావాళ్లు ఎలా తీసుకుంటున్నా ఫ్యామిలీ మాత్రం చిరంజీవిని బాధ పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ఇంతకాలం మెగా పవర్‌స్టార్‌గా పిలిపించుకున్న రామ్ చరణ్ కూడా తన పేరులో ఇక పవర్‌స్టార్ ఉండకూడదని అనుకుంటున్నాడట. అందుకే తన కొత్త సినిమాలో మెగాస్టార్ చరణ్ అని వేయించుకోబోతున్నాడట. ఇంత సాహసానికి చరణ్ నిజంగా ఒడికడతాడో లేదో చూడాలి. ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌ని కట్ చేయడం అతని అభిమానుల్ని ఖచ్చితంగా బాధ పెడుతుంది.
అలాగే చిరంజీవి స్థాయిని అందుకుంటే తప్ప మెగాస్టార్ అనిపించుకునే అర్హత చరణ్‌కి లేదు. మెగాస్టార్ అనిపించుకునే హిట్లు తను ఇవ్వలేదు, నటుడిగా అన్ని మెట్లు ఇంకా ఎక్కలేదు. సింపుల్‌గా మెగా పవర్‌స్టార్ అనేది లేకుండా రామ్ చరణ్ అని వేసుకుంటే పోతుంది కానీ మెగాస్టార్ అని వేసుకుంటే మాత్రం చరణ్ విమర్శల పాలవ్వాల్సిందే.