Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆఖరికి పోస్టర్ ని కూడా వదలరా..?

ఆఖరికి పోస్టర్ ని కూడా వదలరా..?

సినిమా వందరోజుల థియేటర్స్ లెక్కపోయి చాలా రోజులైంది. థియేటర్ల సంఖ్యలో కూడా పట్టింపులు లేకుండా పోతున్నాయి. ఓవరాల్ కలెక్షన్లు, గ్రాస్ రికార్డులూ కనుమరుగవుతున్నాయి. వీకెండ్ కలెక్షన్లు, ఫస్ట్ డే కలెక్షన్లపైనే ఇప్పుడు రికార్డులన్నీ నడుస్తున్నాయి.

ఈ రికార్డులు ఒకెత్తయితే, సోషల్ మీడియా రికార్డులు మరోఎత్తు. టీజర్లు, ట్రైలర్లు.. వీటికి వచ్చిన లైక్ లు లెక్కలేసుకుంటూ వీరాభిమానం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడీ పిచ్చిని పీక్స్ కు తీసుకెళ్లారు ప్రభాస్ అభిమానులు. ఏకంగా పోస్టర్ కు కూడా ట్రెండింగ్ లెక్కలు చెబుతున్నారు.

సర్ ప్రైజ్ డార్లింగ్స్ అంటూ ఏకంగా వీడియో విడుదల చేసి, ఊరించి ఊరించి ఓ పోస్టర్ రిలీజ్ చేసి అందర్నీ నిజంగానే సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. అలా ఎడారిలో ఒయాసిస్సులా వచ్చిన ఆ ఒక్క పోస్టర్ చూసి అభిమానులు తెగ ఇదైపోతున్నారు.

సాహో పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్ రికార్డ్ అట. 24 గంటల్లో ఈ పోస్టర్ కి 8లక్షల లైక్స్ వచ్చాయట. ఇప్పటివరకూ తెలుగు సినీ చరిత్రలో ఏ పోస్టర్ కూ 24 గంటల్లో ఇన్ని లైక్స్ రాలేదని, ఇది ప్రభాస్ కే దక్కిన ఘనత అని చెప్పుకుంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. మరీ పోస్టర్ దగ్గర రికార్డులేంటి బాసూ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇటీవల మహర్షి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా టీజర్, లిరికల్ వీడియోలు అంతంతమాత్రంగానే ఉన్నా.. అవి కూడా రికార్డులేనంటూ ఊదరగొట్టారు. అప్పట్లో మహర్షి రికార్డ్ లకు కౌంటర్లు బాగానే పడ్డాయి.

ఇదిగో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మళ్లీ స్టార్ట్ చేశారు. పోస్టర్ తోనే రికార్డుల్ని వేటాడేస్తున్న వీరు రేపు టీజర్, ట్రైలర్ రిలీజైతే ఊరుకుంటారా. ఏకంగా హాలీవుడ్ రికార్డుల్ని కూడా బద్దలుకొట్టేస్తారేమో.

సీనియర్లకా, జూనియర్లకా.. జగన్ ప్రాధాన్యత ఎవరికి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?