నేను శైలజ..హీరో రామ్ చేస్తున్న వైవిధ్యమైన ప్రయత్నం. రామ్ అంటేనే మాస్ సినిమాలు. కానీ జనం కోసం ఓసారి ప్రేమంటే ఎందుకుంట అంటూ లవ్ జోనర్ ట్రయ్ చేసాడు. కానీ వికటించింది. ఈసారి మళ్లీ కాస్త డిఫరెంట్ గా అదే జోనర్ ట్రయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కథకు, ప్రేమమ్ కథకు కాస్త రిమోట్ పోలికలు వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రేమమ్ సినిమా రీమేక్ అయిడియా అసలు ముందు రామ్ హీరోగానే వచ్చింది. కానీ రామ్ నో అన్నాడు. అలా నో అనడానిక వెనుక రీజన్ ఈ నేను శైలజ అని వినికిడి. ఈ సినిమాకు ముందు హరికథ అని పేరు అనుకున్నారు. కానీ హరి అనేవాడి కథ అనుకునే బదులు సినిమా కాస్తా హరికథలా వుంటుందేమో అని జనం అనుకుంటారన్న డౌట్ వచ్చి వుంటుంది..దాంతో నేను శైలజ అని పేరు మార్చారు.
ట్రయిలర్, టైటిల్ చాలా ప్రామిసింగ్ గా వున్నాయి. ఈ సినిమా హిట్ అయితే రామ్ కు రెండు ప్లస్ పాయింట్లు..ఒకటి పండగ చేస్కో తరువాత హిట్ కొట్టినట్లు అవుతుంది. లవ్ జోనర్ లో తను కూడా ఓ హిట్ కొట్టినట్లు అవుతుంది.