లారెన్స్, ప్రభుదేవా ల మాదిరిగానే మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా మెగా ఫోన్ పట్టబోతున్నాడు. యువ హీరోల చేతి క్లిష్టమైన డ్యాన్స్ లు చేయించే కొరియాగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ డైరక్టర్ కాబోతున్నారు.
యువ హీరో రానా సినిమాకు ఆయన తొలిసారి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సురేష్ మూవీస్ పతాకంపై రానా తండ్రి సురేష్ బాబు నిర్మిస్తారు. కొంతకాలం కిందటే రానాతో బాగా పరిచయం పెరిగిన ప్రేమ్ రక్షిత్ వన్ ఫైన్ మార్నింగ్ మంచి లైన్ చెప్పారు.
తరచు అది డిస్కషన్ జరిగి, 'మీరే చేయచ్చుగా' అని రానా అడిగే వరకు చేరింది. దీనికి నిర్మాత సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా డిష్కషన్లు, స్క్రిప్ట్ వ్యవహారాలు చకచకా నడిచిపోతున్నాయి. నిజానికి ప్రేమ్ కొన్నాళ్ల క్రితం తెరపైకి నటుడిగా రావాలనుకున్నాడని వార్తలు వినవచ్చాయి. కానీ డైరక్షన్ లోకి వెళ్లి తెరవెనుకే వుండిపోతున్నాడు.