రాజ్ తరుణ్ కొంత కాలంగా సైలంట్ గా వున్నాడు. ఫ్లాపులు పలకరించడంతో, సరైన స్క్రిప్ట్ వచ్చాకే సినిమా చేయాలి. అంతవరకు ఖాళీగా వున్నా పరవాలేదు, అనుకుంటూ వెయిట్ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు వేణు తచ్చిన సబ్జెక్ట్ కొంతవరకు ఓకె అయింది కానీ, ఇంకా ముందు వెనుకలు ఆడుతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆ కొత్త దర్శకుడు వేణు తెచ్చిన సబ్జెక్ట్ ఏమిటంటే, మహమ్మద్ బీన్ తుగ్లక్ ఈ రోజుల్లోకి వచ్చి, వర్తమాన రాజకీయాలు చూసి, తను చరిత్రలో చూపిన పాలన స్టయిల్ ను ఇప్పుడు చూపిస్తే ఎలా వుంటుంది అన్నది అని తెలుస్తోంది.
అవుట్ అండ్ అవుట్ సెటైర్లు, ఫన్ పండించే అవకాశం వున్న ఈ స్క్రిప్ట్ కూడా రాజ్ తరుణ్ ను ఓకె అనేలా చేయలేదని తెలుస్తోంది. అతని స్టామినాకు, ఫిజిక్ కు ఈ తరహా తుగ్లక్ క్యారెక్టర్ సెట్ అవుతుందా? పైగా పొలిటికల్ సెటైర్లు, ఎమ్మెల్యేలు వగైరా ప్యాడింగ్ వున్న సబ్జెక్ట్. అందువల్ల సెట్ అవుతాదా? కాదా అని అనుమానంతో అలా వుండిపోయినట్లు తెలుస్తోంది.
మరో నెలరోజుల్లో ఓ ప్రాజెక్టును ఎలాగైనా ఓకె చేయాలనే ఆలోచనలో వున్నాడట రాజ్ తరుణ్. మరి అలా ఓకె చేయించగల స్క్రిప్ట్ ఎవరు తెస్తారో? చూడాలి.