దారిలో పడిన రామ్

అనుభవం అయితే తప్ప దారిలోకి రారు. పాతిక కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ కావాల్సిందే అని కూర్చున్నారు హీరో రామ్. వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఇక అంత ఇచ్చి సినిమాలు తీసే సీన్ లేదని నిర్మాతలు…

అనుభవం అయితే తప్ప దారిలోకి రారు. పాతిక కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ కావాల్సిందే అని కూర్చున్నారు హీరో రామ్. వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఇక అంత ఇచ్చి సినిమాలు తీసే సీన్ లేదని నిర్మాతలు వెనక్కు తగ్గడం మొదలుపెట్టారు. చూస్తుంటే మొదటికే మోసం వచ్చేలా వుంది. అందుకే ఇప్పుడు రెమ్యూనిరేషన్ కు బదులుగా రెండు ఏరియాల పంపిణీ హక్కులు తీసుకునేందుకు వీలుగా దిగి వచ్చారు హీరో రామ్.

హీరో రామ్ కు వరుస ఫ్లాపులే. నిర్మాతలు అంతా కుదేలు. బయ్యర్లు అంతా దిగాలు. ఇలాంటి నేపథ్యంలో మిస్ శెట్టి దర్శకుడు మహేష్ తో మైత్రీ సంస్థ సినిమా అఫర్ వచ్చింది. కానీ మళ్లీ మామూలే పాతిక కోట్లకు పైగా రెమ్యూనిరేషన్. కానీ మైత్రీ సంస్థ అలా అయితే తాము సినిమా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడం కష్టం అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో వైజాగ్, నైజాం ఏరియాల పంపిణీ హక్కులు ఇవ్వమని రామ్ అడిగినట్లు తెలుస్తోంది.

రెండు కీలకమైన ఏరియాలు ఇవ్వలేమని, నైజాం ఇస్తామని, వైజాగ్ కాకుండా మరో ఏరియా ఏదైనా తీసుకోమని బేరం మొదలుకాగా, నైజాం, గుంటూరు ఏరియాలు తీసుకునేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని కూడా

దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాకు ఆరు కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. ఆ సినిమాకు చాలా ఎక్కువ ఓవర్ బడ్జెట్ అయిందనే టాక్ వుంది. అ సంగతి పక్కన పెడితే సన్నిడియోల్ తో చేసే సినిమాకు 10 కోట్ల రెమ్యూనిరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. అంత ఇవ్వలేమని, ఎప్పటి లాగే ఆరు కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చి, లాభాల్లో పదిహేను శాతం వాటా ఇస్తామని నిర్మాతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇలా అయితే ఖర్చు కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

సినిమా రంగ పరిస్థితి బాగా లేదు. నిర్మాతలు, దర్శకులు ఇక దారిలోకి రావాల్సిందే. వరుసగా ఫ్లాపులు కాదు డిజాస్టర్లు ఇస్తున్నా పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ అడుగుతూనే వున్న హీరోలు కూడా నిర్మాతలు లేకపోతే దారి లోకి రాక ఏం చేస్తారు? ఒకరు ముందు, మరొకరు వెనుక. దారిలోకి రావాల్సిందే.

13 Replies to “దారిలో పడిన రామ్”

  1. పెళ్ళాం పిల్లల రచ్చ వల్ల జనాలు ఈ మల్టీ ప్లెక్స్ లకి వెళ్ళి సినిమా లు చూసే తప్పని పరిస్థితి వచ్చింది.. ఏమి డోకా లేదు.. అప్పు చేసైనా సినిమా చూస్తారు…

  2. heroes and directors burns major stake of budget…..and kills cinema industry….. people don’t pay price for their uncontrolled budgets….. OTT is killing Heroes…lol

Comments are closed.