రవితేజ-విఐ ఆనంద్ సినిమా అలా ముందు వెనుకలు ఆడుతోంది. బడ్టెట్ సమస్యలు, పారితోషికం సమస్యలు పైకి వినిపిస్తున్నా, వినిపించని కారణాలు నిర్మాత వైపు నుంచి కూడా వున్నాయని టాక్. ముగ్గురు హీరోయిన్లకు ఇద్దరిని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ తీసుకోవాల్సి వుంది. ఈలోగా రకరకాల వార్తలు వినిపిస్తుంటే, సరైన హీరోల డేట్లు లేక ఒకప్పుడు మంచి సినిమాలు ఇచ్చి, ప్రస్తుతం ఖాళీగా వున్న డైరక్టర్లు రవితేజ వైపు చూస్తున్నట్లు బోగట్టా.
రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి సినిమా అందించిన సంపత్ నంది ఏమైనా అవకాశం దొరుకుతుందా? అని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో మాంచి హిట్ సినిమాలు అందించి, విన్నర్ సినిమాతో వెనుకబడిన గోపీచంద్ మలినేని కూడా రవితేజతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి పేరు ఇప్పటికే వినిపించింది.
కానీ సమస్య ఏమిటంటే ఎవరు రవితేజతో సినిమా చేయాలనుకున్నా కనీసం ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల బడ్జెట్ కావాలి. రవితేజ మీద అంత పెట్టుబడి పెట్టే నిర్మాత కావాలి. మార్కెట్ కావాలి.అదే సమస్య.