మహర్షి సినిమా సెన్సారు అయిపోయింది. ఫుల్ పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూంది. దీనికితోడు సినిమాలో హైలైట్స్ అంటూ కొన్ని పాయింట్లు కూడా వినిపిస్తున్నాయి. సినిమాలో తొలిసగంలో హీరో క్యారెక్టరైజేషన్ కీలకంగా వుంటుందని తెలుస్తోంది. భయంకరంగా డబ్బు వున్న హీరో, ఆ డబ్బు ప్లస్ తన ఆశయం తోడుగా విలన్ ను ఎదుర్కోవడం అన్నది మాంచి కమర్షియల్ పాయింట్ అని టాక్. సినిమాటోగ్రఫీ, డిఐ అన్నీకలిసి సినిమాను కలర్ ఫుల్ గా చేసాయని, మహేష్ మరింత కలర్ ఫుల్ గా వున్నాడని టాక్.
రిజిస్టార్ ఆఫీసులో రైతుల భూముల సీన్
సాయికుమార్-మహేష్ బాబు మధ్య వచ్చే సీన్
ఓ గ్రామం వదిలేయి అని అడిగి, మళ్లీ అన్నీ గ్రామాలు వదలాల్సిందే అంటూ హీరో సవాలు చేసే సీన్
ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ హైలైట్ లుగా వుంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో హీరో డైలాగులకు క్లాప్స్ పడతాయంటున్నారు.
అలాగే క్లయిమాక్స్ లో వేలమంది రైతులు హీరో వెంట వచ్చే సీన్ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది.
క్లయిమాక్స్ లో వచ్చేపాట ఆకట్టుకుంటుందని చెబుతున్నారు
మొత్తంమీద ఓ మాంచి మెసేజ్ సినిమాకు కమర్షియల్ హంగులు అద్దితే ఎలా వుంటుందో, మహర్షి సినిమా అలా వుంటుందన్నది సెన్సారు టాక్.
ఇప్పటికే సినిమాను నిర్మాతలు, వారి సన్నిహితులు చూసారు. వాళ్లంతా ఫుల్ హ్యాపీగా వుండడం విశేషం.