కథానాయికలకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. ఏమాత్రం ఒళ్లు చేసినా… వెంటనే తగ్గిపోవడానికి కసరత్తులు మొదలెట్టేస్తారు. ఇప్పుడు సమంత కూడా అదే పనిలో పడింది. సమంతకు లావైపోతున్నా అనే భయం వేసిందట. అందుకే ఇప్పుడు స్లిమ్ అవ్వాలని చూస్తోంది.
సమంత జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. నెలరోజుల్లో కనీసం ఆరు కిలోలు తగ్గాలన్న టార్గెట్ పెట్టుకొందట. సమంతకు ఈమధ్య సినిమాలు తగ్గుతున్నాయి.
తాజాగా రామ్‌చరణ్ సినిమా నుంచీ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందాలకు మెరుగులు దిద్దుకోపోతే… టాలీవుడ్‌లో రాణించడం కష్టమనుకొందో ఏమో… ఇలా జిమ్ముల్లో కష్టపడుతోంది. త్వరలోనే సమంతని కొత్తగా చూస్తామన్నమాట.