ఎన్టీఆర్‌ ఒక్కడే మిగిలాడు

తెలుగు సినిమా సూపర్‌స్టార్‌ స్టామినాకి కొలమానంగా ఫిఫ్టీ క్రోర్స్‌ క్లబ్‌ నిలుస్తుంది. ఈ క్లబ్‌లో ఇంతవరకు టాప్‌ హీరోల్లో చాలా మంది చేరిపోయారు. పవన్‌కి అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్‌ ఉన్నాయి. మహేష్‌కి దూకుడు, సీతమ్మ…

తెలుగు సినిమా సూపర్‌స్టార్‌ స్టామినాకి కొలమానంగా ఫిఫ్టీ క్రోర్స్‌ క్లబ్‌ నిలుస్తుంది. ఈ క్లబ్‌లో ఇంతవరకు టాప్‌ హీరోల్లో చాలా మంది చేరిపోయారు. పవన్‌కి అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్‌ ఉన్నాయి. మహేష్‌కి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో ఈ క్లబ్‌లో సెకండ్‌ ప్లేస్‌ దక్కింది. 

ముందుగా ఈ క్లబ్‌లో చేరిన రామ్‌ చరణ్‌ ఇంకా ఆ ఒక్క సినిమాతోనే ఉన్నాడు. గత ఏడాది రేసుగుర్రంతో అల్లు అర్జున్‌ కూడా రేసులోకి చేరిపోయాడు. మిర్చితో ఈ క్లబ్‌కి దగ్గరగా వచ్చాడు కానీ అందుకోలేకపోయిన ప్రభాస్‌ ‘బాహుబలి’తో గ్యారెంటీగా కొట్టేస్తాడనేది ఆ చిత్రానికి జరుగుతోన్న బిజినెస్‌ని బట్టి చెప్పొచ్చు. 

ప్రభాస్‌ కంటే ముందుగా ఈ క్లబ్‌లో చేరడానికి ఎన్టీఆర్‌కి ఇది లాస్ట్‌ ఛాన్స్‌. పదేళ్ల క్రితమే సూపర్‌స్టార్‌ అనిపించేసుకున్నా తన స్థాయికి తగ్గట్టుగా విజయాలు అందుకోలేకపోయిన ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’తో ఈ ఫీట్‌ సాధించలేకపోతే… టాప్‌ హీరోల్లో ఈ ఫీట్‌ సాధించిన లాస్ట్‌ హీరో అయిపోతాడు. మొదట్లో అంచనాలు పెద్దగా లేకపోయినా విడుదలకి దగ్గర పడ్డాక టెంపర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ భారీగానే పెరిగాయి. మరి ఎన్టీఆర్‌ యాభై కోట్ల కల దీంతో తీరిపోతుందా?