అల్లు అర్జున్తో ఛాన్స్ రాగానే నిత్య మీనన్ ఫైనల్గా స్టార్ హీరోతో నటిస్తోందని, తన ప్రతిభకి తగిన గుర్తింపు దక్కిందని అనుకున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఈ పాత్ర కోసమని త్రివిక్రమ్ చాలా మంది హీరోయిన్లని సంప్రదించాడు. కానీ ఎందుకనో వారంతా కూడా ఆఫర్ రిజెక్ట్ చేసారు.
దానికి కారణమేంటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ చిత్రంలో నిత్య మీనన్ చేస్తున్నది అల్లు అర్జున్ సిస్టర్ క్యారెక్టర్ అట. కాబట్టి ఇది ముగ్గురు హీరోయిన్ల కథ కానే కాదన్నమాట. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉండే టిపికల్ సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి మిగతా హీరోయిన్లు వెనక్కి తగ్గితే… నిత్య మీనన్ మాత్రం ధైర్యంగా ఓకే చేసేసింది.
హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తూ సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న నిత్య ఈ టైమ్లో సిస్టర్ క్యారెక్టర్ చేయడమంటే పెద్ద రిస్కే. ఎప్పటికైనా స్టార్ హీరోలతో అవకాశాలు వస్తాయనే ఆశలు ఉన్నా ఈ సినిమాతో అవి పూర్తిగా అడుగంటిపోయే అవకాశముంది. తెలిసి తెలిసీ నిత్య అందుకు ఎందుకు తెగించేసిందో మరి.