పూరితో మళ్లీ నితిన్?

చినదాన నీ కోసం మీద చాలా హోప్ పెట్టుకున్నాడు నితిన్ . కానీ కాస్త ఆశాభంగమే అయింది. అయితే ఆ సంగతి అలా వుంచి తరువాతి సినిమా ఎవరితో అన్నదానిపై బిజీగా వున్నాడు. అయితే…

చినదాన నీ కోసం మీద చాలా హోప్ పెట్టుకున్నాడు నితిన్ . కానీ కాస్త ఆశాభంగమే అయింది. అయితే ఆ సంగతి అలా వుంచి తరువాతి సినిమా ఎవరితో అన్నదానిపై బిజీగా వున్నాడు. అయితే ఏ కథ విన్నా అంతగా నచ్చడం లేదు నితిన్ కు. ముగ్గురు దర్శకులను ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసకుని వున్నాడు. పూరి తో మళ్లీ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. 

మరోపక్క పాటల రచయిత, దర్శకుడు చైతన్య కృష్ణతో ఏదన్నా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మంచి కథ రెడీ చేయమని అడిగాడు. ఆయన ఆ పని మీద వున్నాడు. ఇక నితిన్ తో సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు మల్లిడి వేణు ఎప్పటి నుంచో నితిన్ సినిమాకు దర్శకత్వం వహించాలని చూస్తున్నాడు. లైన్ లు చెబుతున్నాడు..అతగాడికి నచ్చడం లేదు. ఇప్పుడు సీరియస్ గా మరో కథ మీద వున్నాడు. ఈ ముగ్గురిలో ఎవరి సినిమా ముందు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.