తమ ఫ్యామిలీ ఎంత కన్సర్వేటివో ఆ మధ్య ఒకసారి వివరించింది సమంత రౌత్ ప్రభు. తాము పక్కా క్రిస్టియన్లమని, హిందూ సంప్రదాయాలు ఏమిటో, హిందూ పురణాలు ఏమిటో కనీస అవగాహన కూడా లేదని సమంత చెప్పింది. టీవీలో రామాయణ, మహాభారతాల టెలికాస్ట్ అవుతుంటాయి కదా.. వాటిని కూడా తన తల్లి చూడనిచ్చేది కాదని సమంత చెప్పింది. టీవీలో వాటిని చూడాలన్నా వారించేది అని.. దీంతో బేసిక్స్ కూడా తెలియకుండా పోయాయని సమంత చెప్పింది.
మరి అంత కన్సర్వేటివ్ క్రిస్టియన్ ఒత్తిళ్ల మధ్య పుట్టి పెరిగిన అమ్మాయి.. ఇప్పుడు సొంతంగా, ఒక్కతే తిరుమల వెళ్లి శ్రీనివాసుడిని దర్శించకునేంత వరకూ రావడం గమనార్హమే.
సమంత నిన్న తిరుమల వెళ్లింది, ఆమె వెంట చైతూ కానీ, ఆమెకు సన్నిహితులైన ఇతర సినీ ప్రముఖులు కానీ కనిపించలేదు. ఆమె వ్యక్తిగతంగా వెళ్లి దర్శనం చేసుకుంది. పేరులో కూడా క్రిస్టియానిటీ ఉట్టిపడే ఈమె ఇలా అచ్చమైన హిందువు అయిపోవడం విశేషం. ఇదంతా నాగచైతన్యతో ప్రేమ మహత్యమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో!