సర్దార్ నైజాం గొడవ వెనుక..

బిడ్డ చనిపోయినా పురిటికంపు పోలేదన్నది సామెత. సర్దార్ గబ్బర్ సింగ్ వ్యవహారం అలాగే వుంది. సినిమా ఫ్లాపయింది. హీరో పవన్ కళ్యాణ్  తప్ప నిర్మాతతో సహా ప్రతి ఒక్కరు లాస్ అయ్యారన్నది వాస్తవం. నిర్మాతకు…

బిడ్డ చనిపోయినా పురిటికంపు పోలేదన్నది సామెత. సర్దార్ గబ్బర్ సింగ్ వ్యవహారం అలాగే వుంది. సినిమా ఫ్లాపయింది. హీరో పవన్ కళ్యాణ్  తప్ప నిర్మాతతో సహా ప్రతి ఒక్కరు లాస్ అయ్యారన్నది వాస్తవం. నిర్మాతకు లాస్ ఏమిటని అనుకోవచ్చు. కానీ వాస్తవం అదే. ఈ విషయాన్ని హీరో పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్ గానే చెప్పారు. నిర్మాత లాస్ అయ్యారు కాబట్టే మరో సినిమా చేయమని ఇచ్చారు పవన్. అందులో ఇంకో పరమార్థం కూడా వుందని వినికిడి. సర్దార్ సినిమా లావాదేవీలకు సంబంధించి పవన్ కు నిర్మాత శరద్ మురార్ ఇవ్వాల్సిన మొత్తం ఇంకా కొంత వుంది. సర్దార్ ఫ్లాప్ అయిందని పవన్ అదేమీ వదలుకోలేదు. విడతలవారీగానో, కాటమరాయుడు సినిమా అమ్మకాల్లోంచో ఇవ్వమని కాస్త రిలాక్సేషన్ ఇచ్చారంతే.

నైజాం గొడవేమిటి?

సరే, ఇదిలా వుంటే నైజాం బయ్యర్ సర్దార్ లో భయంకరంగా లాస్ అయ్యారు. అది వాస్తవం. ఏడు కోట్ల వరకు ఆయన నష్టపోయారు. అయితే ఇక్కడ తెరవెనుక వ్యవహారం వేరుగా వుంది. సర్దార్ సినిమాలో ఈరోస్ భాగస్వామి. ఈరోస్ కు నైజాం ఇంద్ర ఫిలింస్ తో సాన్నిహిత్యం. దాంతో దిల్ రాజుకు కానీ, ఏసియన్ సునీల్ కు కానీ నైజాం సర్దార్ హక్కులు ఇస్తామంటే ఈరోస్ అడ్డం పడిందట. తాము కూడా నిర్మాణంలో భాగస్వామే కనుక, ఎలాగైనా ఇంద్ర ఫిలింస్ కే ఇవ్వాలని వత్తిడి చేసినట్లు వినికిడి. దాంతో శరద్ మురార్ కు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇవ్వక తప్పలేదు.

కట్ చేస్తే..

సరే..కాలం గడిచిపోయింది. కాటమరాయుడు రెడీ అయిపోయింది. సమస్య తెలుసుకాబట్టి శరద్ మురార్ నైజాం హక్కులను ఇంద్రకే ఇవ్వడానికి ఆఫర్ చేసారు. కానీ దానికి అట్నుంచి ఎస్ ఆర్ నో లేదు. దీంతో ఏసియన్ సునీల్ కు 18 కోట్ల పైగా మొత్తానికి ఇచ్చేసారు. అప్పుడు మళ్లీ ఇంద్ర ఫిలింస్ రంగప్రవేశం చేసిందని వినికిడి. ఇక్కడ ఎక్కడ సమస్య అంటే..కావాలంటే ఇప్పుడు కూడా మీకే ఇస్తాం..ఆ అమౌంట్ కట్టేసి తీసుకెళ్లండి అంటారు వీళ్లు. సినిమా వద్దు కానీ, ఏడు కోట్లు నష్టపోయాను ఏదో ఒకటి చూడిండి అంటారు వాళ్లు. బలవంతపెట్టి, ఈరోస్ తో వత్తిడి చేయించి, అవుట్ రేట్ కు కొనుక్కున్నారు.పైగా తామూ నష్టపోయాం. ఏం చేయలేం అంటారు వీళ్లు. 

ఇంకో పక్క ఈరోస్ కూడా నిర్మాతకు ఫోన్ చేసి, లాస్ అయ్యాడు కదా ఏదో ఒకటి చూడండి అంటోందని వినికిడి. భాగస్వామిగా మీ వాటా మీరు తీసుకు వెళ్లిపోయి, మమ్మల్ని చూడమంటారేమిటి? అన్నది వీళ్ల వాదన.

ఇదీ సర్దార్-నైజాం-కాటమరాయుడు వ్యవహారం. నిర్మాతకు బయ్యర్ కు మధ్య ఇన్నాళ్లు నలుగుతున్న వ్యవహారం ఇప్పుడు ఇంద్ర ఫిలింస్ ప్రెస్ మీట్ పెట్టడంతో బయటకు వస్తోంది. వాళ్ల వాదన, పాయింట్లు ఇంకేం వున్నాయో చూడాలి.