‘వకీల్’ కోసం స్పెషల్ సాంగ్?

అల వైకుంఠపురములో సినిమాలో ఓ డైలాగు రాసారు త్రివిక్రమ్…అన్నీ వేసినా ఇంకా ఏదో తక్కువైనట్లుంది కదా? అనే అర్థం వచ్చేలా. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఇప్పుడు అదే ఫీల్…

అల వైకుంఠపురములో సినిమాలో ఓ డైలాగు రాసారు త్రివిక్రమ్…అన్నీ వేసినా ఇంకా ఏదో తక్కువైనట్లుంది కదా? అనే అర్థం వచ్చేలా. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారని బోగట్టా.  

ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసారు. ఫైట్లు పెట్టారు. హీరోయిన్ వగైరా జోడించారు. పవన్ లుక్ ను యంగ్ గా మార్చారు. ఇన్ని చేసినా ఇంకా వకీల్ సాబ్ కు ఏదో వెలితి అన్న ఫీలింగ్. 

అందుకే ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మరీ ఐటమ్ సాంగ్ పెడితే బాగోదు. అందుకే ప్రారంభంలో టైటిల్స్ మీదే ఓ సాంగ్ ను వేస్తే ఎలా వుంటుంది అన్నది ఆలోచన.

ఇందుకోసం ముగ్గురు హీరోయిన్లు ఎవరినయినా స్పెషల్ గా ఒప్పించి, వారి మధ్యలో పవన్ ను పెట్టి చిత్రీకరించాలన్నది ఐడియా. అలా  ఇప్పటికిప్పుడు ముగ్గురు హీరోయిన్లు ఎవరు దొరుకుతారా? అని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో టీడీపీ క‌థ ముగిసినట్లేనా !

కళ్యాణ్ గారితో నన్ను పోల్చొద్దు