సన్నీ పాట చూపించవా ప్లీజ్

డిఫరెంట్ అందాలను తెరపైకి తేవడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ తరువాతే. అందునా ఐటమ్ సాంగ్ లకు ఎక్కడికెక్కడి అమ్మాయిలనో దిగుమతి చేస్తాడు టాలీవుడ్ కు. అలాంటిది సన్నీ లియోన్ మీద మనసు ఎందుకు పారేసుకోకుండా…

డిఫరెంట్ అందాలను తెరపైకి తేవడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ తరువాతే. అందునా ఐటమ్ సాంగ్ లకు ఎక్కడికెక్కడి అమ్మాయిలనో దిగుమతి చేస్తాడు టాలీవుడ్ కు. అలాంటిది సన్నీ లియోన్ మీద మనసు ఎందుకు పారేసుకోకుండా వుంటాడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో సన్నీ ని చూపించాలని వుంది పూరికి. మిగిలిన భాషల సినిమాల్లో సన్నీ ఎలా వుంటుందో తెలియంది కాదు. 

కానీ తెలుగులో నేటివిటీ కి ఏ మాత్రం దగ్గరగా వుందో చూడాలని అనుకుంటున్నట్లున్నాడు. అందుకే మంచు మనోజ్ ను అడిగాడట. కరె్ంటు తీగలో ఆమె సీన్లు, కానీ పాట కానీ ఓ సారి చూపించమని. పూరి అడగడమే తడువుగా మనోజ్ ఓకె అన్నాడని బోగట్టా. త్వరలో పూరి ముచ్చట మనోజ్ తీర్చేస్తాడు. నచ్చితే ఎన్టీఆర్ సినిమాలోకి ప్రమోట్ అయిపోతుంది సన్నీ.