cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూపర్ స్టార్ కు మేనేజర్ కావలెను?

సూపర్ స్టార్ కు మేనేజర్ కావలెను?

టాలీవుడ్ సూపర్ స్టార్ అతగాడు. అతగాడు తన మేనేజర్ ను మార్చే ఆలోచనలో వున్నారా? నిజమో, కాదో కానీ ఆ మేరకు గ్యాసిప్ లు అయితే ఇండస్ట్రీలో గుప్పుమని వినిపిస్తున్నాయి. ఇప్పటిప్పుడు కాకపోవచ్చు కానీ, మాంచి మేనేజర్ దొరికితే మార్చాలన్న ఆలోచన అయితే వుందని, అందుకోసం సైలంట్ గా వెదుకులాట సాగుతోందని వినిపిస్తోంది.

నిజానికి ఆ సూపర్ స్టార్ కు నమ్మకమైన మేనేజర్ చిరకాలంగా వున్నారు. కానీ మరి ఆ మేనేజర్ కు సూపర్ స్టార్ చుట్టూ వుండే వాళ్లకు తేడా వచ్చిందో? లేదా సూపర్ స్టార్ వ్యవహారాలు గట్టిగా పట్టుకుని చూసుకునే వాళ్లకు తేడా వచ్చిందో కానీ, మేనేజర్ ను మార్చే అవకాశం వుందంటూ గ్యాసిప్ లు అయితే పుట్టాయి. 

ఇక్కడే మరో గ్యాసిప్ కూడా వినిపిస్తోంది. ఆ సూపర్ స్టార్ వ్యవహారాలు అన్నీ తానై చూసే పర్సన్ ఒకరు, మెలమెల్లగా సూపర్ స్టార్ చుట్టూ వుండే టీమ్ మొత్తాన్ని తన మనుషులతో నింపాలని చూస్తున్నారని, అందులో భాగంగానే మేనేజర్ మార్పు అన్న గ్యాసిప్ పుట్టిందని వినిపిస్తోంది. కొన్నాళ్లు ఆగితే క్లారిటీ వస్తుందేమో?