Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుప్రియ.. అంతా బుస్సే

సుప్రియ.. అంతా బుస్సే

అయితే వార్తలన్నా వుండాలి. లేదా వార్తలన్నా వండాలి. ఇదీ ఇప్పటి ట్రెండ్. అయితే ఒక్కోసారి ఇలా వండిన వార్తలు మిస్ ఫైర్ అవుతుంటాయి. అది కామన్ కూడా. నాగార్జున మేనగోడలు యార్లగడ్డ సుప్రియ గురించి ఇలాంటి వంటకం వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆమె విలన్ గా నటించబోతోందంటూ. అది కూడా వెంకీ-చైతూల కాంబినేషన్ లోని వెంకీ మామ సినిమాలో.

కానీ వాస్తవం ఏమిటంటే, అంతా బస్సే అని, అలాంటిదేమీ లేదేని. ఆ మాటకు వస్తే వెంకీమామలో సుప్రియకు సెట్ అయ్యే లేడీ క్యారెక్టర్ కానీ, విలన్ క్యారక్టర్ కానీ లేనే లేదని. ప్రస్తుతం గ్యాప్ లో వున్న వెంకీ మామ షూట్ తరువాత షెడ్యూలు కాశ్మీర్ లో జరుగుతుంది.

ఈ సినిమాను చకచకా ఫినిష్ చేసి, వీలైతే దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో వుంది యూనిట్. సురేష్ మూవీస్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మించే ఈ సినిమాకు బాబీ దర్శకుడు.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?