cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

రాత్రికి రమ్మని పిలిచిన ఆ కల్ట్ హీరో ఎవరు?

రాత్రికి రమ్మని పిలిచిన ఆ కల్ట్ హీరో ఎవరు?

కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు టాలీవుడ్ నుంచి మీడియాకూ పాకిన విషయం తెలిసిందే. రకరకాల మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పూసగుచ్చినట్టు బయటపెడుతున్నారు. వాటిపై సదరు మీడియా సంస్థల్లో అంతర్గతంగా విచారణ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా తెలుగు మీడియాకు చెందిన ఓ మహిళా ఉద్యోగి బయటకొచ్చారు. గతంలో తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు.

పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పనిచేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది ఓ మహిళా జర్నలిస్ట్. ఓ నైట్ పార్టీలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత తనను పలుమార్లు గెస్ట్ హౌజ్ కు పిలిచాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ రోజు రాత్రి తను మద్యం సేవించలేదని, ఆ తర్వాత గెస్ట్ హౌజ్ కు కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చింది.

తన పెళ్లికి 2 రోజుల ముందువరకు ఆ 'కల్ట్ హీరో' తనకు ఫోన్ చేసేవాడని, ఒక్కసారి కలవాలి రమ్మని పిలిచేవాడని చెప్పుకొచ్చింది సదరు మహిళా జర్నలిస్ట్. అయితే తనకు పెళ్లి కుదిరిందని చెప్పడంతో, ఆ తర్వాత నుంచి ఆ బడా హీరో నుంచి తనకు కాల్స్, మెసేజీలు రావడం ఆగిపోయాయని తెలిపింది.

మహిళా జర్నలిస్ట్ ఈ వివరాలు బయటపెట్టిన వెంటనే ఆ 'కల్ట్ హీరో' ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొంతమంది మెగాహీరోలతో పాటు నందమూరి హీరోల పేర్లు కూడా తెరపైకి రావడంతో రచ్చ పీక్ స్టేజ్ కు చేరిపోయింది.

ఒక దశలో పోస్టులు పెట్టిన మహిళా జర్నలిస్టును 'కల్ట్ హీరో' అభిమానులు కొంతమంది దారుణంగా ట్రోల్ చేయడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో తన పోస్టును ఆమె తొలిగించింది. కొంతమంది నెటిజన్లతో పాటు మరికొంతమంది మహిళా జర్నలిస్టులు సైతం ఆమెకు మద్దతుగా నిలిచినప్పటికీ.. సదరు జర్నలిస్ట్ మాత్రం వెనక్కితగ్గింది.

తనను ఇండస్ట్రీలో కొనసాగనివ్వరని, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటూ పెట్టిన పోస్టులు తీసేసింది. ఇలా టాలీవుడ్ లో బయటకురాని కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు ఇంకెన్నో.