సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్న రేయ్‌ని భారీ ఎత్తున విడుదల చేయడానికి వైవిఎస్ చౌదరి ప్లాన్ చేస్తున్నాడు. కాస్త ఆలస్యమైనా మెగా హీరో సినిమా రిలీజ్ ఏ రేంజ్‌లో ఉండాలన్నది ఈ దర్శకుడి ఆలోచన.
ఇప్పుడు రేయ్‌ని వెస్టీండీస్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వెస్టీండీస్ లోనే ఎందుకంటే రేయ్‌లో ఎక్కువ భాగం కరేబీయన్ దీవుల్లో తెరకెక్కించారు. దాదాపు 50 శాతం షూటింగ్ అక్కడే జరిగింది.
అందుకే ఈ సినిమాని ఇంగ్లీష్ లో డబ్ చేయించి ఆదేశంలో విడుదల చేస్తారట. పిబ్రవరి 20 న రేయ్ విడుదల ఖాయమని వైవిఎఎస్ చెబుతున్నాడు. ఈలోగా ఈ సినిమా ప్రమోషన్స్ ఓ లెవిల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా నిర్విహించే పనిలో ఉన్నాడు.