రుద్రమదేవి తరవాత అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఫిక్సయిపోయింది. ఆమె దృష్టి ఇప్పుడు భాగమతిపై పడింది. హైదరాబాద్ నగర నిర్మాత కులీ కుతుబ్ షా.. భార్య కథ ఇది. ఈ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రానికి మిర్చి నిర్మాతలు సారథ్యం వహిస్తారు.
ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తేలిపోయింది.. తనెవరో కాదు.. అశోక్ జి. పిల్లజమిందార్ సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడీయన. ఆ తరవాత సుకుమారుడు తీశారు. అది ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ పరాజయం మూలంగా వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్సయ్యింది.
ఇప్పుడు మాత్రం బంగారంలాంటి ఆఫర్‌ని ఒడిసి పట్టుకొన్నాడు. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చు. ఈ ఛాన్స్‌ని ఈ దర్శకుడు ఎంత సద్వినియోగం చేసుకొంటాడో చూడాలి.