సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత వ్యవహారాలను పూర్తి స్వేచ్ఛస్వతంత్రాలతో తీసుకుంటున్నా వారిని అభిమానించే జనాలు మాత్రం ఇంకా వారి విషయంలో తెగ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలియా భట్ విషయంలో కూడా ఇంతే. గత ఏడాది వివాహం చేసుకున్న అలియా వెనువెంటనే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం, ఒక బేబీకి జన్మనివ్వడం కూడా జరిగింది.
అయితే ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న అలియా భట్ నవంబర్ నెలలోనే ప్రసవించడం పట్ల జనాలు ఒక ఇదైపోయారు. దీన్ని బట్టి వివాహానికి పూర్వమే అలియా భట్ ప్రెగ్నెంట్ అని వీరు తేల్చి తెగ నొచ్చుకున్నారు, బుగ్గలు నొక్కుకున్నారు. అయితే వీరి కామెంట్లను, ఆశ్చర్యాలను అలియా, ఆమె భర్త, కుటుంబం పూర్తి లైట్ తీసుకుంది.
అంతే కాదు.. తాజాగా అలియా ఆ విషయం గురించి కూడా స్పందించింది. వివాహానికి పూర్వం తను హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టుగా ఆ సమయానికి తను ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సీన్లను చేయడానికి ఇబ్బంది పడినట్టుగా అలియా చెప్పింది. అప్పటికి రణ్ బీర్ తో ఈమెకు పెళ్లి కాలేదు. అయితే తను ప్రెగ్నెంట్ అనే విషయం ఆ సినిమా యూనిట్ కు తెలియజేసినట్టుగా, దీంతో యాక్షన్ సీన్లను చేసేటప్పుడు తనను చాలా జాగ్రత్తగా వారు చూసుకున్నట్టుగా అలియా వివరించింది.
అలియా ఒక హాలీవుడ్ సినిమాలో నటించిందప్పుడు. అలా ప్రెగ్నెంట్ గా తొలి రోజుల్లో తను షూటింగ్ లో పాల్గొన్న వైనం గురించి ఈమె వివరించింది.