తంగం తేలిపోయింది, సీత మునిగిపోయింది

పాన్ ఇండియా పేరిట తెలుగు సినిమా ఆఫర్లు వస్తే ఇకపై బాలీవుడ్ హీరోయిన్లు భయపడతారేమో. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారేమో. మొన్నటికిమొన్న అలియాభట్, ఇప్పుడు జాన్వి కపూర్.. ఇద్దరూ భారీ అశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.…

పాన్ ఇండియా పేరిట తెలుగు సినిమా ఆఫర్లు వస్తే ఇకపై బాలీవుడ్ హీరోయిన్లు భయపడతారేమో. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారేమో. మొన్నటికిమొన్న అలియాభట్, ఇప్పుడు జాన్వి కపూర్.. ఇద్దరూ భారీ అశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. వాళ్ల పాత్రలు మాత్రం తెలుగు హీరోల హీరోయిజం ముందు తుస్సుమన్నాయి.

దేవర సినిమాలో తనకు రాయడానికి చాలా కష్టమనిపించిన పాత్ర జాన్వి కపూర్ దే అంటూ స్వయంగా వెల్లడించాడు కొరటాల. తంగం పాత్రను రాయడానికి చాలా కష్టపడ్డానని, తను ఎంత కష్టపడ్డానో, ఆ పాత్రను పోషించడానికి జాన్వి కూడా అంత కష్టపడిందని ప్రచారం టైమ్ లో చెప్పుకొచ్చాడు.

కట్ చేస్తే, తంగం తేలిపోయింది. ఆమె పాత్ర అతిథి పాత్ర కంటే కాస్త ఎక్కువగా ఉందంతే. ఓ సాంగ్ కూడా తీసేయడంతో, ఆమె స్క్రీన్ టైమ్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమెకు 5 కోట్లు పారితోషికం ఇచ్చారనే టాక్ ఉంది. అదే కనుక నిజమైతే, అంత రెమ్యూనరేషన్ వృధా. డబ్బు సంగతి పక్కనపెడితే, జాన్వి కపూర్ టాలీవుడ్ డెబ్యూకు ఏమాత్రం పనికిరాని సినిమా దేవర-1.

ఆమధ్య ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏకంగా అలియాభట్ ను రంగంలోకి దించారు. రాజమౌళి దర్శకుడు అనగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించింది అలియా. తీరా సినిమాలో చూస్తే, ఆమెకు గట్టిగా 4 సీన్లు కూడా లేవు.

ఉన్నంతలో ఈమధ్య కాలంలో దీపిక పదుకోన్ టాలీవుడ్ ఎంట్రీనే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. కల్కి సినిమాలో ఆమె పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, కథలో మమేకమైన పాత్రను ఆమె పోషించింది.

ఇకపై బాలీవుడ్ భామలు, పాన్ ఇండియా అనే పదానికి పొంగిపోకుండా, తమ పాత్ర ఏంటనేది తెలుసుకొని, తెలుగు సినిమాలకు సైన్ చేస్తే బెటర్.

6 Replies to “తంగం తేలిపోయింది, సీత మునిగిపోయింది”

  1. అసలు నువ్వేదో పెద్ద మేధావిలా ప్రతి ఒక్కడిని విమర్శిస్తావ్ ఎవడ్రా నువ్వు అసలు.. అటు రాజకీల్లో కూడా అంతే ప్రతి ఒక్కడిని ఎగతాళిగా మాట్లాడతాం.. అన్నిటిలో నీకు అంత పెద్ద జ్ఞానం ఉంటే నువ్వు ఆయా రంగాలల్లో పొడిచింది ఏంటో చూపించి ఎదుటి వాళ్ళని ఎగతాళి చెయ్యరా సన్నాసి

Comments are closed.