Advertisement

Advertisement


Home > Movies - Movie News

అన్ని సినిమాలు ఆగస్టులోనే?

అన్ని సినిమాలు ఆగస్టులోనే?

తెలంగాణలో థియేటర్లు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆగిపోయిన సినిమాలు అన్నీ ఇక విడుదలకు రెడీ అయిపోవచ్చా? అలా అంటే మాత్రం నో అనే అనాలేమో? ఎందుకంటే తెలంగాణ మార్కెట్ ముఫై అయిదు శాతం అయితే ఆంధ్ర, సీడెడ్ కలిపి అరవై అయిదు శాతం. అక్కడ ఇంకా థియేటర్లు ఓపెన్ కాలేదు. ఇప్పట్లో ఓపెన్ అవుతాయా? అన్నది అనుమానంగానే వుంది.

ఈ నెల 30 వరకు లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికే ఆంధ్రలో వెల్లడి అయ్యాయి. వాటి ప్రకారం థియేటర్లు తెరచుకునే వీలు లేదు. జూలై 1 వేళకు వచ్చే కొత్త నిబంధనలు తెలిస్తేనే విడుదలలు ప్లాన్ చేసుకోవచ్చు. ఆంధ్రలో ఇప్పటికీ నిత్యం అయిదారువేల కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి.

అందువల్ల జూలై 1 నుంచి కూడా నిబంధనలు కొత్తగా సడలింపు వుంటుందా? అన్నది అనుమానం. ఇప్పుడు వున్న నిబంధనల ప్రకారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అన్ని వ్యాపారాలు చేసుకునే అవకాశం వుంది. కేవలం బార్లు, థియేటర్లు, స్కూళ్లు, ఇలాంటివి తప్ప. మరో పది రోజుల్లో కేసులు బాగా తగ్గిపోయినా కూడా ఆపై మరో పది రోజులు వేచి చూసి కానీ బార్లకు, థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవచ్చు.

పైగా స్కూళ్లు మూసేసి, బార్లు, థియేటర్లు తెరిస్తే విమర్శలు వస్తాయి. గతంలో వచ్చాయి కూడా. అందువల్ల ఈసారి అన్నీ చూసుకుని కానీ అనుమతి ఇవ్వడం జరగకపోవచ్చు. హైదరాబాద్ లో వ్యాక్సినేషన్ ఎక్కువ వుండొచ్చు. కానీ ఆంధ్రలో పట్టణాల్లో ఆ మేరకు లేదు. అందువల్ల ఆంధ్రలో రిస్క్ ఫ్యాక్టర్ కాస్త ఎక్కువే వుంటుంది.

ఇవన్నీ ఇలా వుంచితే ఆంధ్రలో టికెట్ ల వ్యవహారం ఒకటి ఇంకా వుండనే వుంది. ఎగ్జిబిటర్లు అంతా వెళ్లి సిఎమ్ జగన్ ను కలిసి కాస్తయినా రేట్ల పెంపు తెచ్చుకోవాల్సి వుంది. సినిమా హీరోలు అంతా కలిసి వెళ్తారనే టాక్ వుంది. కానీ వాళ్లు వెళ్తే పని జరగదు. 

ఎగ్జిబిటర్లు వెళ్తేనే బెటర్ అనే కామెంట్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సిట్యువేషన్ సెట్ అయితే తప్ప దీని మీద దృష్టి వుండదు. ఇవి కాక ఇంటర్ పరిక్షలు జరపాల్సి వుంది. 

ఏతా వాతా ఇవన్నీ జరగాలంటే జూలై వదిలేయాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల సినిమాల విడుదల అంతా ఆగస్టులోనే ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది. అక్టోబర్ వేళకు పెద్ద సినిమాలు వచ్చి పడతాయి. అందువల్ల ఆగస్టు, సెప్టెంబర్ ల్లో ప్రతి వారం రెండు మూడు సినిమాల వంతున కుమ్మేసే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?