వస్తే ఉప్పెన మాదిరిగా అన్ని సినిమాలు ఓకేసారి విడుదలవుతాయి. లేదంటే థియేటర్లు ఖాళీగా మూత పెట్టుకోవాల్సి వుంటుంది. వచ్చే నెల 15న ఇదే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. మూడు పెద్ద సినిమాలు, రెండు సినిమాలు డేట్ లు వేసాయి. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, మిస్టర్ బచ్చన్ సినిమాలు మూడు పెద్ద సినిమాలే. డబుల్ ఇస్మార్ట్ కు సీక్వెల్ క్రేజ్ వుంది. పూరి-రామ్ కాంబినేషన్. ఆ క్రేజ్ చాలా అడ్వాంటేజ్. అందుకే వరల్డ్ థియేటర్ రైట్స్ 60 కోట్ల మేరకు అమ్ముడు పోయాయి.
తంగలాన్ తమిళ సినిమా అయినా ఓ డిఫరెంట్ జానర్. సరైన సబ్జెక్ట్ తో సినిమా తీస్తే మన వాళ్లు నెత్తిన పెట్టుకుంటారు. ఎటొచ్చీ నచ్చాలి.. అంతే. ఇప్పటి వరకు వచ్చిన తంగలాన్ కంటెంట్ కాస్త ఆసక్తికరంగానే వుంది. కానీ డీ గ్లామర్ కంటెంట్ గా కనిపిస్తోంది. అందువల్ల ఎలా వుంటుందో చూడాలి.
మిస్టర్ బచ్చన్.. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న రవితేజ సినిమా. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాలు రెండూ కాపీలు రెడీగా వున్నాయి. కానీ బచ్చన్ సినిమా ఇంకా 12 రోజులు షూట్ వుంది. ఆ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ కావాల్సి వుంది. విడుదలకు ఇంకా 25 రోజుల సమయం వుంది. ఆ టైమ్ సరిపోతుందా అన్నది చూడాలి. డిజిటల్ సంస్థలు, థియేటర్ హక్కుల విక్రయం స్పీడప్ అవుతుంది అనే ఆలోచన ఈ డేట్ అనౌన్స్ మెంట్ వెనుక వుందనే టాక్ కూడా వుంది. అవి ఓకె అయితే కిందా మీదా పడైనా అగస్ట్ 15 కు బచ్చన్ వచ్చేస్తాడు.
ఇక మిగిలినవి రెండు చిన్న సినిమాలు. వీటిల్లో సురేష్ సంస్ధ అందించే 35 అనే చిత్రమైన టైటిల్ తో వస్తన్న చిన్న సినిమా ఒకటి. ఇది వాయిదా పడితే పడిపోవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాల మధ్య ఇంత చిన్న సినిమా వస్తే కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు ప్రెజెంటర్ మాత్రమే హీరో రానా. నిర్మాత వేరు. రిస్క్ తీసుకోగలరా అంటే అనుమానమే.
గీతా సంస్థ నిర్మించిన ఆయ్ సినిమా మరోటి. ఇది వాయిదా వేస్తారా? అన్నది అనుమానమే. వరుస సెలవులు వున్నాయి కనుక, ఎంతొ కొంత కలెక్షన్ వస్తుందనే నమ్మకంతో విడుదల చేసేస్తారేమో?
మొత్తం మీద అగస్ట్ 15 కు ఓ మూడు సినిమాలు అయితే విడుదల ఫిక్స్ కావచ్చు.
అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.
ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , మన బాబు బె వినుకొండ మడర్‌ని ప్లాన్ చేసారుఅంట .
అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.
ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.
జనం పట్టించుకోరు
ఎన్ని వచ్చినా మేం థియేటర్లో చూడం