రీల్స్ పిచ్చిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూశాం. రన్నింగ్ ట్రయిన్ పక్కన నిల్చొని, నదిలో ప్రయాణిస్తూ, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ, ఇలా ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ చేస్తూ మృత్యువాత పడిన ఘటనలున్నాయి.
అంతెందుకు, మొన్నటికిమొన్న రాజస్థాన్ లో నాటు తుపాకీతో రీల్స్ చేయబోయి 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రీల్స్ కోసం ఉరేసుకున్నట్టు నటించబోయి, నిజంగానే మృత్యువాత పడ్డాడు ఓ బాలుడు.
మధ్యప్రదేశ్ లోని మొరెనాకు చెందిన ఏడో తరగతి విద్యార్థి కరణ్ పర్మార్, స్కూల్ పూర్తయిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటకెళ్లాడు. సరదాగా రీల్స్ తీసుకోవడం ఈ పిల్లలకు అలవాటు. ఈసారి కూడా అదే చేయబోయారు.
అయితే కాస్త కొత్తగా ట్రై చేయాలని భావించారు. ఉరి వేసుకున్నట్టు ఓ రీల్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది కరణ్ కి.. అనుకున్నది తడవుగా ఓ పునాది గోడ ఎక్కి, చెట్టుకు తాడుకట్టుకొని ఉరేసుకునేలా నటించడానికి ట్రై చేశాడు.
ఈ క్రమంలో గోడ పై నుంచి చెప్పు కిందకు జారింది. ఆ వెంటనే తాడు కరణ్ మెడకు బిగుసుకుంది. ఇదంతా మిగతా ఫ్రెండ్స్ ఫోన్ లో షూట్ చేస్తున్నారు. అదంతా నటన అని వాళ్లు భావించారు. అయితే ఎంతకూ కరణ్ కదలకపోవడంతో వాళ్లకు అనుమానం వచ్చింది, ఆ వెంటనే భయం పట్టుకుంది. దీంతో ఫోన్ ను అక్కడే పడేసి పరుగులుపెట్టారు.
కాసేపటికి కొంతమంది దీన్ని గమనించి, కరణ్ ను బయటకుతీసుకొచ్చారు. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే కరణ్ మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు.
అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.
ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , మన బాబు బె వినుకొండ మడర్‌ని ప్లాన్ చేసారుఅంట .
naa comentlu anni delete chesinav le. nee kharma ki nuvvu potav le
Nagarjuna friend from Manmadhudu
ఇలాంటి పిచ్చోల్లు పోతేనే దేశానికి మంచిది… ఉంటే ఈడు చెడిపోయేదే కాక ఇంకో నలుగుర్ని చెడగొడతాడు….