భువన విజయమ్..వెరైటీ టీజర్

చిన్న సినిమా చూడాలి అంటే కంటెంట్ ఆసక్తిగా అనిపించాలి. అప్పుడే జనం అటుచూడడం ప్రారంభిస్తారు. రొటీన్ వుండే చిన్న సినిమాలు అన్నా, లేదా చిన్న సినిమాలే అనిపించే చిన్న సినిమా అన్నా జనం పట్టించుకోవడం…

చిన్న సినిమా చూడాలి అంటే కంటెంట్ ఆసక్తిగా అనిపించాలి. అప్పుడే జనం అటుచూడడం ప్రారంభిస్తారు. రొటీన్ వుండే చిన్న సినిమాలు అన్నా, లేదా చిన్న సినిమాలే అనిపించే చిన్న సినిమా అన్నా జనం పట్టించుకోవడం మానేసారు. ఇలాంటి నేపథ్యంలో ‘భువనవిజయం’ అనే సినిమా టీజర్ వచ్చింది. కచ్చితంగా ఆసక్తికరంగా వుంది. గతంలో ఇవివి సినిమాల్లో పదో, పాతికో కామెడీ క్యారెక్టర్ లు వుండడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్ కు ఓ లైనూ లెంగ్తూ, డిటైలింగూ వుండేది. అలాంటి వర్క్ ఈ భువన విజయమ్ టీజర్ లో కనిపించింది.

’పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి.. ఒక కథ తేలాలి’’ ఇదీ ‘భువన విజయమ్’ టీజర్ లో వినిపించిన వాయిస్ ఓవర్. వాయిస్ ఎంత ఆసక్తికరంగా వుందో టీజర్ కూడా అంతే ఆసక్తిగా సాగింది. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, వైవా హర్ష ఇంకా పలువురు ప్రధాన పాత్రలలో కనిపించారు. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భువన విజయమ్’. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతి లాంచ్ చేశారు.

అతని కథేంటో అతనికే తెలీయని ఒక హీరో, జాతకాల పిచ్చి వున్న ఒక నిర్మాత , ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. అవసరం కోసం రచయితగా మారిన ఓ దొంగ.. ఇలా ఆసక్తికరమైన పాత్రలని పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ‘భువన విజయమ్’ సినిమాపై ఆసక్తిని పెంచింది.

టీజర్ లో కావాల్సిన హ్యుమర్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ కూడా వుంది. ఒక సినిమా పై ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించడం టీజర్ ముఖ్యం ఉద్దేశం. ఈ విషయంలో భువన విజయమ్ టీజర్ సక్సెస్ అయ్యింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.