తండ్రిన చంపిన కొడుకు, అనుమానంతో భార్యని చంపిన భర్త, ఆస్తి కోసం కొట్టుకుచచ్చిన అన్నదమ్ముళ్లు.. ఇలాంటి దారుణాలు గతంలో కూడా జరిగాయి. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రాణం తీయడం, శవాన్ని ముక్కలు ముక్కలుగా కోయడం, ఆ ముక్కల్ని ఏ అడవిలోనో విసిరేయడం, అప్పటివరకూ వాటిని ఫ్రిజ్ లోనో, సూట్ కేస్ లోనో, నీళ్ల ట్యాంక్ లోనో దాచి పెట్టడం. ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న హత్యా నేరాల్లో ఈ కామన్ పాయింట్స్ కనపడుతున్నాయి. తాజాగా తండ్రిన చంపిన ఓ తనయుడు ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేస్ లో కుక్కాడు.
ఆస్తి కోసం తండ్రి దారుణ హత్య..
తండ్రి సంపాదిస్తే వచ్చిన ఆస్తిలో ఆ తండ్రికే వాటా లేదనే దుర్మార్గపు కొడుకులు ఉన్న రోజులివి. జీవితాన్నిచ్చిన తండ్రికి తిండిపెట్టే బాధ్యత లేదంటే ఓకే, కానీ ఆయన సొంత కష్టంతో సంపాదించిన ఆస్తిని కూడా ఆయన అనుభవించకూడదంటే ఎట్లా. పూర్తిగా తనకే కావాలని కొడుకులు లాగేసుకుంటే తండ్రి ఏం చేయాలి..? ఎలా బతకాలి..? కొడుక్కి ఎదురుతిరిగినందుకు ఆ తండ్రి గొడ్డలి పోటుకు బలయ్యాడు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుంద్ కాలనీ మురళీధర్ గుప్త తన ఇద్దరు కొడుకులతో కలసి నివాసం ఉండేవాడు. పెద్ద కొడుకు సంతోష్ కి, మురళీధర్ కి మధ్య తరచూ ఆస్తి విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు మరీ ప్రాణం తీసేంత పెద్దవి అవుతాయని తండ్రి ఊహించలేదు.
ఓరోజు తండ్రి గాఢనిద్రలో ఉండగా పెద్ద కొడుకు సంతోష్ సుత్తితో తలపగలగొట్టి చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేస్ లో కుక్కి, ఇంటి వెనక ఖాళీ స్థలంలో దాచి పెట్టాడు. ఆ తర్వాత ఆ ముక్కల్ని పారవేసి ఏమీ తెలియనట్టు నటించాలనుకున్నాడు. కానీ తమ్ముడికి అనుమానం వచ్చింది. అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీన్ లోకి ఎంటరవ్వడంతో సూట్ కేస్ లో తండ్రి శరీర భాగాలు కనిపించాయి. సంతోష్ ను అరెస్ట్ చేశారు. శవాన్ని మాయం చేయాలనే క్రమంలో ఇటీవల ముక్కలు ముక్కలుగా నరకడం అనేది హంతకుల్లోని శాడిజాన్ని చూపెడుతోంది.