వెంకీ మామకు గట్టి పరీక్ష!

ఇప్పుడు కూడా పుల్లింగ్ లేకపోతే ఇక సినిమాలు చేయడం చేయకపోవడం మీద దృష్టి పెట్టకతప్పదు కదా?

ఈ సంక్రాంతికి ఎవరికి ఎలా ఉన్నా, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కు మాత్రం ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. 2024 సంక్రాంతి వెంకీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. “యాక్షన్ విత్ ఫ్యామిలీ టచ్” అనే జానర్‌లో సైంధవ్ అనే సినిమాను అందించారు. సినిమా కంటెంట్ బాలేదా, సినిమా బాలేదా అన్నది పక్కన పెడితే, మినిమమ్ పులింగ్ కూడా బాక్సాఫీస్ దగ్గర కనిపించలేదు. ఫలితంగా, దారుణంగా ఫెయిల్ అయింది.

2025 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మరోసారి ప్రయత్నం చేస్తున్నారు వెంకీ. మారుతున్న యువతరం అభిరుచుల ప్రకారం, సినిమాలకు ఆదరణ మారుతోంది. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ మరియు బాలకృష్ణల‌కు తప్పితే, మరెవరికీ సరైన సక్సెస్‌లు కనిపించడం లేదు.

సంక్రాంతికి రెండు సార్లు ఫ్యామిలీ ఫన్ మూవీస్‌తో వచ్చి నాగ్ ప్రూవ్ చేసుకున్నారు. కానీ, అంత మాత్రాన నాగ్ ట్రాక్ అద్భుతంగా ఉందని అనుకోవడానికి లేదు. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. . నిర్మాతలు ఒక్కొక్కరూ మునిగిపోతున్నారు. మెగాస్టార్, బాలకృష్ణ లు బెటర్ పొజిషన్ లో వున్నారు. ఇప్పుడు ఇంతకీ విక్టరీ వెంకటేష్ పరిస్థితి ఏమిటన్నది క్లారిటీ రావాలి.

గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 తో రెండు హిట్ లు. ఫ్యామిలీ సబ్జెక్ట్. పైగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తోడు వున్నారు. 2024లో యాక్షన్ జానర్ ఫెయిల్. 2025లో మళ్లీ ఫ్యామిలీ జానర్ కు వచ్చారు. యంగ్ హీరో తోడు లేదు. సోలోగా ఇద్దరు హీరోయిన్లతో ట్రయ్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే సీనియర్ హీరోగా ఓ క్లారిటీ వస్తుంది వెంకీకి తను ఎలా ముందుకు వెళ్లాలో. లేదూ ఇది కూడా తేడా చేస్తే, ఇక ప్రశాంతంగా కెరీర్ ను నిలిపే అవకాశం కూడా వుండొచ్చు. ఫ్యామిలీ సబ్జెక్ట్, అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ కాంబినేషన్, పాటలు హిట్. సంక్రాంతి సీజన్. ఇప్పుడు కూడా పుల్లింగ్ లేకపోతే ఇక సినిమాలు చేయడం చేయకపోవడం మీద దృష్టి పెట్టకతప్పదు కదా?

7 Replies to “వెంకీ మామకు గట్టి పరీక్ష!”

  1. సినిమాలు ఆపేయాలని నువ్వే డిసైడ్ చేస్తావా? ఏం స్పెషల్ రోల్స్ చేయలేడా అమితాబ్ లాగా?

  2. Saindhav bagane untundi… action sequences baguntayi… venkatesh action scenes baga chesaru..kodite air lo bounce aye chetha fights kakunda… wrong time lo release chesaru.. reviews kuda anti ga icharu…bad luck

  3. Veedi cinema li anni oke moosa type..playing always same monotony..so much young talent and Middle Aged talent available..perhaps directors problem, Evadi daggara dabbu unte vaadiki taggattu stories, screen play..

    creativity is no where seen..most of the movies scenes arw western/korean copied these days..

    anduke anni just doomed at box office

  4. వెంకీ సినిమాలు మానేయవలసినంత వయసు రాలేదు కానీ ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు పాత్రలు మాత్రం ఆపేయాలి. నలభై ఏళ్లు దాటిన వ్యక్తి, పాత్రలతో, సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా ఉండే స్క్రిప్టులు ఎన్నుకుని ముందుకి వెళితే బాగుంటుంది. దృశ్యం లాంటి సినిమాలు దొరికితే హిట్స్ వస్తాయి.

Comments are closed.