జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!

జనసేనలో చేరితే.. ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టుగా చెప్పుకుంటున్నారు.

జనసేన పార్టీలోకి కొత్తగా కొందరు నాయకులు చేరారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, ఆయన భార్య రాధ ఉన్నారు. వీరికి పవన్ కల్యాణ్ స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎన్నికల తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఆ పార్టీని వీడి ఎన్డీయే కూటమి పార్టీల్లో చేరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారం ఉన్నచోటకు అందరూ చేరుతుండడం వింతేమీ కాదు. ఆ క్రమంలోనే ఈ తాజా చేరికల్నికూడా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఈ చేరికలతో జనసేన కొత్త బలాన్ని సంతరించుకున్నట్లేనా? లేదా, ఈ చేరికల వెనుక మరేదైనా ఇతర వ్యూహాలు ఉన్నాయా? అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా నడుస్తున్నది.

కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరడం ఒక ఎత్తు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి- రాధ దంపతులు ఆపార్టీలో చేరడం మరో ఎత్తు. గంజి చిరంజీవి స్వతహాగా తెలుగుదేశానికి చెందిన నాయకుడు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేశారు. వైసీపీకి చెందిన ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీనే నమ్ముకుని పనిచేస్తూ వచ్చారు. మునిసిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు. 2019ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీచేయాలని అనుకున్న తరువాత.. ఆయనకు భంగపాటు తప్పలేదు. కానీ.. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

తర్వాతి పరిణామాలలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆప్కో ఛైర్మన్ అయ్యారు. వైసీపీలో చేనేత విభాగం అధ్యక్షుడు కూడా. గంజి చిరంజీవి వైసీపీని వీడి జనసేనలో చేరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నదనే అనుమానం ప్రజల్లో ఉంది.

తెలుగుదేశంలో చేరితే.. మంగళగిరి నియోజకవర్గం నుంచి పదవులు ఆశించే టీడీపీ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అందరికీ పదవుల పంపకం కష్టం అవుతుంది. అలా కాకుండా జనసేనలో చేరితే.. ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ చేరికల కారణంగా జనసేన పార్టీ బలోపేతం అయినట్టుగా భావించవచ్చునా లేదా అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి. అలాగే.. అనేక నైతికవిలువలు ప్రవచించే పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో రాజీనామా చేయించకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారు.. అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

9 Replies to “జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!”

  1. జయమంగళ ఇప్పటికే రాజీనామా చేశారు. కాకపోతే వైసీపీ కె చెందిన మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. కొంచెం చెక్ చేసుకొని వ్రాయి వార్త.

      1. మీ పేరుకి మీ భాషకి పొంతన లేదు .. అయినా జూన్ నాలుగున దిగింది సరిపోలేదు అనుకుంట .. ఇంకా బూతులు వీడలేదు ..

  2. సన్నాసి తాలు రకం గజ్జి గంజి గారు పార్టీ నుంచి వెళ్తేనే మంచిది కడుపుకు కూడు తినెవడైతే

    ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి వెళ్ళేవాడు

  3. సన్నాసి తాలు రకం గజ్జి గంజి గారు పార్టీ నుంచి వెళ్తేనే మంచిది కడుపుకు కూడు తినెవడైతే

    ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి వెళ్ళేవాడు

Comments are closed.