విశాఖతోనే ప్రయోగం

విశాఖలో ఇపుడు పాత కరెంట్ మీటర్లు కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ కరెంట్ మీటర్లు ఆవిష్కృతం కాబోతున్నాయి.

విశాఖ నగరంతోనే ఒక సరికొత్త ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు తెర తీయనున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కరెంట్ మీటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. వాటిని విశాఖ వంటి స్మార్ట్ సిటీతోనే మొదలెట్టాలని చూస్తోంది. ఇక్కడ నుంచి వచ్చే రియాక్షన్ రిజల్ట్ ని చూసుకుని ఏపీ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.

విశాఖలో ఇపుడు పాత కరెంట్ మీటర్లు కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ కరెంట్ మీటర్లు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇపుడు ఈ కార్యక్రమం చాలా స్పీడ్ గా సాగుతోంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ కరెంట్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత వాటిని నగరంలోని వాణిజ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అలా కమర్షియల్ కనెక్షన్లు సంబంధించి స్మార్ట్ మీటర్ల బిగింపు అన్నది పెద్ద ఎత్తున సాగుతోంది.

దీని తరువాత దశలో డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లకు ఈ మీటర్లను బిగిస్తారు అని అంటున్నారు. ఇలా దశల వారీగా విశాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్ల బిగింపు ప్రక్రియ సాగుతోంది. ఈ స్మార్ట్ కరెంట్ మీటర్లకు చిప్ ని ఏర్పాటు చేస్తారు.
దాని ద్వారా విద్యుత్ సరఫరా కావాలంటే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లకు రీచార్జి చేసుకునే విధానంలో ఇక మీదట విద్యుత్ విషయంలో చేయాలన్న మాట. ఎంత సొమ్ము కడితే అంతకు సరిపడా కరెంట్ అందుతుంది.

రీచార్జి అయిపోతే అది అర్ధరాత్రి అయినా కరెంట్ ఠక్కున పోతుంది. దాంతో ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకుని చెక్ చేసుకోవాల్సిందే. అందుకే ముందుగా విశాఖలో ఈ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చే స్పందనతోనే ఏపీ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తారని అంటున్నారు. ఈ ప్రయోగం జనాలకు ఎంత వరకూ నచ్చుతుందో అన్నది రిజల్ట్ బట్టి తేలాల్సిందే.

6 Replies to “విశాఖతోనే ప్రయోగం”

    1. హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు gated కమ్యూనిటీ అన్నిట్లో స్మార్ట్ మీటర్లు వాడుతున్నారు

  1. స్మార్ట్ మీటర్ అసలు ఉదెశం చెప్పకుండా రీచార్జ్ అని ఎడుస్తావ్!

    .

    స్మార్ట్ మీటర్లు ద్వరా ఒక రొజులొ సమయన్ని బట్టి వివిధ రకాల టారిఫ్‌లు ఉంటాయి . ఉదాహరణకు రొజులొ peek సమయలలొ విద్యత్ ఉపయొగిస్తె ఎక్కువ రెటు, తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు విద్యత్ ఉపయొగిస్తె తక్కువ ఛార్జీ విధించబడుతుంది. ఈ రకమైన టారిఫ్‌తో, విద్యుత్ గ్రిడ్‌పై లొడ్ తగ్గి, ఆదా అవుతుంది. అన్ని దెశలలొ ఇప్పుడు స్మార్ట్ మీటర్ వాడుతున్నారు.

  2. Emi GA,

    papam prajalani badadaniki..smart meters.

    while technology is inevitable, it also has double sided sword..if this govt implemented, it’s suicidal for this govt..but cbn is chameleon..so he will implement in such a way, the next government will bear the effects of this..

    smart meters with big data mining, political leaders can use in such a way that they will suck people blood and hard earned money

Comments are closed.