ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. సుజీత్ దర్శకత్వంలో ఓజీ చేస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు.. హరీశ్ శంకర్ డైరక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఈ 3 సినిమాల అప్ డేట్స్ ను స్వయంగా హీరో పవన్ కల్యాణ్ వెల్లడిస్తే ఎలా ఉంటుంది? ఇది అలాంటి సందర్భమే.
తన 3 సినిమాల అప్ డేట్స్ ను పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా తన సినిమాలు లేట్ అవ్వడానికి తాను కారణం కాదని సంచలన ప్రకటన చేశారు. తను ఇచ్చిన టైమ్ లో మేకర్స్ సినిమాలు పూర్తిచేయలేకపోయారని ఆరోపించారు.
“ఆ 3 సినిమాలకు ఏం జరిగిందంటే, నేను ఇచ్చిన టైమ్ కు వాళ్లు షూటింగ్ పూర్తిచేయలేదు. చెప్పిన టైమ్ తర్వాత చేయలేనని వాళ్లకు ముందే చెప్పాను. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమా వాళ్లకు ఈ విషయం ముందే చెప్పాను.”
సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాపై క్లియర్ గా స్పందించారు పవన్ కల్యాణ్. ఆ సినిమా టైటిల్ కు అర్థమేంటి.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి లాంటి విషయాల్ని వెల్లడించారు.
“ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అంటుంటే అవి నాకు అరుపుల్లా వినిపించడం లేదు. బెదిరిస్తున్నట్టు అనిపిస్తోంది. 1980-90ల్లో బాంబే బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు. కానీ ఈ సినిమాలో ఓజీ అంటే ‘ఓజాస్ గంభీర్’ అని అర్థం. ఓజీ విషయానికొస్తే, నేను ఆ సినిమా చేయడం వల్ల అంత ఫాస్ట్ గా అయింది. నేనే దగ్గరుండి పుష్ చేశాను. నాతో సంబంధం లేని పార్ట్ మొత్తం ముందే పూర్తిచేయమని వాళ్లకు చెప్పాను.”
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఆ సినిమాకు టైమ్ ఇచ్చారంట. కానీ పవన్ చెప్పిన టైమ్ కు వాళ్లు స్క్రిప్ట్ రెడీ చేసుకోలేదని, ముందు అనుకున్న కథను మళ్లీ చేయాల్సి వచ్చేసరికి టైమ్ దాటిపోయిందన్నారు పవన్.
హరిహర వీరమల్లు సినిమా 8-9 రోజులు షూటింగ్ ఉందని. ఆ సినిమాకు సంబంధించి ప్రీ-విజువలైజేషన్ పని నడుస్తోందని తెలిపారు. ఇలా తను చేస్తున్న 3 సినిమాలకు సంబంధించి ఫుల్ అప్ డేట్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
pawala
Enni cheppinaa, no PK movie will complete and release in next 3-4 years.
Indulo neeku update em kanilinchindi
Happy new year 2025 to all