కరోనా కట్టడికి హాస్యనటుడు బ్రహ్మానందం అలాంటి, ఇలాంటి స్కెచ్ కాదు…అదిరిపోయే స్కెచ్ వేశాడు. ఇదేమీ కామెడీ కోసం చెబుతున్నది కాదండోయ్. అవును, ఈ రోజు (ఆదివారం) నవ్వుల దినం. ఎటూ రీల్ లైఫ్‌లో నవ్వించే అవకాశం లేకపోవడంతో ఆయన హాబీకి పదును పెట్టాడు.
బ్రహ్మానందంలో కేవలం హాస్య నటుడే కాదు…మంచి చిత్రకారుడు కూడా ఉన్నాడు. ఆయనలోని ఆ కళా నైపుణ్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బ్రహ్మానందం మంచి పెయింటర్. లాక్‌డౌన్‌లో ఇంటిపట్టున ఖాళీగా కూచున్న బ్రహ్మానందం కళా హృదయం మేల్కొంది. దీంతో కుంచె చేతపట్టాడు.
తాజాగా కరోనా నియంత్రణ కోసం భారతీయుల పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చక్కటి చిత్ర శిల్పాన్ని చెక్కేందుకు యత్నించాడు. భారత్ లాక్‌డౌన్ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కు భయం పుట్టేలా చేసినట్టు చిత్రీకరించాడు. ప్రస్తుతం బ్రహ్మానందం చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హ్యాట్సాఫ్ బ్రహ్మానందం గారూ!