బన్నీ..పవన్..మినహా మరెవ్వరూ

లెక్కకు మిక్కిలిగా మెగా హీరోలు వున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టయిలిష్ స్టార్, మెగా ప్రిన్స్, ప్రిన్సెస్, ఇలా జాబితా చాలా పెద్దదే వుంది. టాలీవుడ్ లో ఓ అపోహ…

లెక్కకు మిక్కిలిగా మెగా హీరోలు వున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టయిలిష్ స్టార్, మెగా ప్రిన్స్, ప్రిన్సెస్, ఇలా జాబితా చాలా పెద్దదే వుంది. టాలీవుడ్ లో ఓ అపోహ వుంది. మెగా హీరోలతో సినిమా తీస్తే కాస్తయినా ఓపెనింగ్స్, కలెక్షన్లు వుంటాయని. కానీ రాను రాను ఈ భ్రమలు తొలగిపోతున్నాయి. 

మెగా హీరోల్లో బన్నీ, పవన్ మినహా మరెవ్వరికీ పుల్లింగ్ పవర్ లేదని క్లారిటీ వచ్చేస్తోంది. దర్శకుడు, బ్యానల్, కథ, అన్నీ సెట్ అయితే హిట్ కొట్టి, వీరి ఖాతాలో వేసుకుంటారు. లేదంటే నిర్మాతలు కుదలైపోతారు. కానీ బన్నీ, పవన్ కు ఈ విషయంలో మినహాయింపు వుంది. 

సినిమా యావరేజ్ గా వున్నా లాక్కు వెళ్లగల సత్తా వుంది. ఫ్యాన్ బేస్ వుంది. మిగిలిన వారికి ఇది లేదు. ఆఖరికి మెగాస్టార్ కూడా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గిపోతున్నట్లే కనిపిస్తోంది. కానీ నిర్మాతలు ఇంకా భ్రమల్లోనే వున్నారు. మెగా హీరోల రెమ్యూనిరేషన్లు పెరుగుతూనే వున్నాయి. మెగా హీరోలతో సినిమా తీయాలంటెే కనీసం ఎనిమిది కోట్ల రెమ్యూనిరేషన్ కు రెడీ అయిపోవాలి. కానీ సినిమా పోతే కనీసం ఆ రెమ్యూనిరేషన్ పాటి కలెక్షన్లు వుండవు.

ముఖ్యంగా ఓటిటి వచ్చిన తరువాత, ఆంధ్రలో, తెలంగాణలో టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచేసుకున్న తరువాత టాలీవుడ్ లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. నాన్ థియేటర్ రేట్లు బాగా వస్తుండడంతో సినిమాల నిర్మాణం జోరుగా సాగుతోంది. టెక్నీషియన్లు, నటులు ఎవ్వరూ అందుబాటులో లేరు. 

ఆఖరికి ఎక్విప్ మెంట్ కూడా. దీంతో రెమ్యూనిరేషన్లు పెరిగిపోయి, పెరిగిన ఆదాయం అక్కడ విరిగిపోతోంది.మరోపక్క టికెట్ రేట్లు, ఓటిటి పెరగడంతో, థియేటర్ కు ఫుట్ పాల్ తగ్గిపోతోంది. దాంతో థియేటర్ మీద ఆదాయం సన్నగిల్లుతోంది. కేవలం ఓ రేంజ్ సినిమాలకే జ‌నం థియేటర్లకు వస్తున్నారు.  

దీనివల్ల మిడ్ రేంజ్ సినిమాల భవిష్యత్ డోలాయమానంలో పడుతోంది. సినిమాలు బాగాలేదు అంటే చాలు మినిమమ్ డబ్బులు కూడా రావడం లేదు. గతంలో ఇలా వుండేది కాదు. కాస్తయినా కాసులు రాలేవి. కానీ ఇప్పుడు సినిమా యావరేజ్ అంటే చాలు జ‌నం బై..బై అంటున్నారు. 

ఇదే తీరు ఇలాగే కొనసాగితే మిడ్ రేంజ్ సినిమాల భవిష్యత్ అంథకారంలో పడుతుంది. నాన్ థియేటర్ డబ్బులు చూపించి, మొన్న, అటు మొన్న వరకు మూడు నాలుగు కోట్లు తీసుకునేవారు కూడా ఎనిమిది తొమ్మిది కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పది కోట్ల రేంజ్ జ‌నాలు పది హేను నుంచి ఇరవైకి ఎగబాకారు.

ఒక ఏడాది దాటితే సినిమా జ‌నాలకు వాస్తవం బోధపడుతుంది. అప్పుడయినా ఈ మిడ్ రేంజ్ హీరోలు కిందకు దిగి రావాల్సి వుంటుంది. లేదూ అంటే కష్టమే.