ఎట్టకేలకు జగన్ కొత్త కేబినెట్‌పై ఉత్కంఠకు తెరదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. జగన్ కొత్త కేబినెట్ వివరాలు వెల్లడయ్యాయి.
కొత్త కేబినెట్ వివరాలను గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. సోమవారం కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు కొత్త మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. కొత్త కేబినెట్‌కు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
బొత్స సత్యనారాయణ (విజయనగరం), రాజన్నదొర (పార్వతీపురం) , ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు (శ్రీకాకుళం), గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు (అనకాపల్లి), దాడిశెట్టి రాజా (కాకినాడ), పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగో పాల్‌కృష్ణ (కోనసీమ), తానేటి వనిత (తూ.గో), కారుమూరి నాగేశ్వరరావు.
కొట్టు సత్యనారాయణ (ప.గో), జోగి రమేష్ (కృష్ణా), అంబటి రాంబాబు (పల్నాడు), మేరుగ నాగార్జున (బాపట్ల), విడదల రజని (గుంటూరు), కాకాని గోవర్ధన్‌రెడ్డి (నెల్లూరు), అంజద్‌బాష (కడప), బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (నంద్యాల), గుమ్మనూరు జయరాం (కర్నూలు), పెద్దిరెడ్డి రాచంద్రారెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి (చిత్తూరు), ఉషశ్రీ చరణ్ (అనంతపురం), తిప్పేస్వామి (శ్రీసత్యసాయి).
ఇదిలా వుండగా కొత్త కేబినెట్ వివరాలు వెల్లడి కావడంతో ఊహాగానాలకు తెరపడింది. ఆశావహుల్లో మంత్రి పదవి దక్కని వాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తులను బుజ్జగిస్తున్నారని సమాచారం.