చిరు..మహేష్..విష్ణు

మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో…అన్నట్లుగా వుంది. సినిమా  టికెట్ల వ్వవహారం. చిరంజీవి వెళ్లారు. త్వరలో శుభవార్త అన్నారు. నెల రోజులు దాటిపోయింది. మహేష్..ప్రభాస్..చిరు అంతా వెళ్లారు. త్వరలో అన్నీ పరిష్కారం…

మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో…అన్నట్లుగా వుంది. సినిమా  టికెట్ల వ్వవహారం. చిరంజీవి వెళ్లారు. త్వరలో శుభవార్త అన్నారు. నెల రోజులు దాటిపోయింది. మహేష్..ప్రభాస్..చిరు అంతా వెళ్లారు. త్వరలో అన్నీ పరిష్కారం అన్నారు మహేష్. అని వారం దాటి పోతోంది. ఇప్పుడు విష్ణు వెళ్లారు. అన్నీ మాట్లాడారు అని వార్తలు వచ్చాయి.

అంతా బాగానే వుంది. జ‌నాలు వెళ్తున్నారు. జ‌గన్ రిసీవ్ చేసుకుంటున్నారు. వస్తున్నారు. కానీ పని మాత్రం జ‌రగడం లేదు. కనీసం 100 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. మార్చి 1 నుంచి వస్తుందేమో చూడాలి. కొత్త రేట్లు రాలేదు. ఈలోగా కొత్త రేట్ల మీద మరీ ఆశ పెట్టుకోనక్కరలేదు. మహా అయితే ఇరవై రూపాయలకు మించి పెరుగుదల వుండదని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ఇండస్ట్రీ తో ఆంధ్ర ప్రభుత్వం హైడ్ అండ్ సీక్ ఆట ఆడుకుంటున్నట్లుంది. లేదా టెన్షన్..అటెంన్షన్ లో వుంచి సరదా పడుతున్నట్లుంది. కిందన చూస్తుంటే థియేటర్లు కొత్త సినిమా వస్తే చాలు వంద రూపాయల యూనిఫారమ్ రేటు అమ్మేస్తున్నాయి. 

అంటే ప్రభుత్వం ఆదేశాలు లేకున్నా వాళ్ల పని వాళ్లు కానిచ్చేస్తున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు అంతా చేరడం లేదు. నిర్మాతలకు లెక్కలు అందడం లేదు. అయోమయ పరిస్థితి అలాగే కోనసాగుతోంది.

మరోపక్కన ఇదంతా పవన్ కళ్యాణ్ మీద పగతోనే అన్న ప్రచారం బలంగా ప్రఙల్లోకి వెళ్లిపోతోంది. ఇది కొంత వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుతోంది. ఇంత మంది చెబుతున్నా జ‌గన్ ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.