ముదురు హీరో పెళ్లిపై మళ్లీ పుకార్లు

అతడికి 41, ఈమెకు 31.. ఇద్దరూ ప్రేమలో పడ్డారట. చాలా దూరం వెళ్లారట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారట. ఆ 41 ఏళ్ల హీరో శింబు, 31 ఏళ్ల హీరోయిన్ నిధి అగర్వాల్. Advertisement…

అతడికి 41, ఈమెకు 31.. ఇద్దరూ ప్రేమలో పడ్డారట. చాలా దూరం వెళ్లారట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారట. ఆ 41 ఏళ్ల హీరో శింబు, 31 ఏళ్ల హీరోయిన్ నిధి అగర్వాల్.

మూడేళ్ల కిందటొచ్చిన ఓ సినిమాతో కలుసుకున్నారు శింబు-నిధి అగర్వాల్. అప్పుడే వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అయ్యారంటూ కథనాలు వచ్చాయి. ఆ తర్వాత అవి తగ్గిపోయాయి. తాజాగా మరోసారి శింబు-నిధి పేర్లు తెరపైకొచ్చాయి.

ఎప్పటికైనా తన కొడుకు ప్రేమ వివాహమే చేసుకుంటాడంటూ టి.రాజేందర్ ప్రకటించడంతో ఈ జంట మరోసారి హైలెట్ అయింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనేది కోలీవుడ్ టాక్. నిధి అగర్వాల్ సినిమాలు తగ్గించడానికి ఇదే కారణం అంటోంది కోలీవుడ్.

శింబుకు ప్రేమలు కొత్త కాదు. నయనతారతో అతడు చాలా దూరం వెళ్లాడు. పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆ తర్వాత హన్సికతో కూడా డేటింగ్ చేశాడు. వాళ్లు కూడా చాలా దూరం వెళ్లారు. వాళ్ల రిలేషన్ షిప్ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ సుభిక్ష పేరు కూడా వార్తల్లోకెక్కింది కానీ అదంత వైరల్ అవ్వలేదు.

ఇప్పుడు నిధి అగర్వాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈసారి శింబు పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు చాలామంది. ఎప్పట్లానే ఈ పుకార్లపై శింబు సైలెంట్ గా ఉన్నాడు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఓ పాట పాడాడు శింబు. మరోవైపు అతడు నటించిన మన్మధ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది.

6 Replies to “ముదురు హీరో పెళ్లిపై మళ్లీ పుకార్లు”

  1. వీడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మే పిచ్చి హీరోయిన్లు ఇంకా ఉన్నారన్నమాట

Comments are closed.