అన్ స్టాపబుల్ – మళ్లీ మరోసారి!

అహా ఓటిటి సంస్థకు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్..అన్ స్టాపబుల్. సీనియర్ హీరో బాలకృష్ణ చాలా అద్భుతంగా నిర్వహించారు తొలి సీజ‌న్ ను. తరువాత రెండో సీజ‌న్ లేదా స్పెషల్ ఎపిసోడ్ లు కూడా చేసారు.…

అహా ఓటిటి సంస్థకు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్..అన్ స్టాపబుల్. సీనియర్ హీరో బాలకృష్ణ చాలా అద్భుతంగా నిర్వహించారు తొలి సీజ‌న్ ను. తరువాత రెండో సీజ‌న్ లేదా స్పెషల్ ఎపిసోడ్ లు కూడా చేసారు. కానీ తరువాత మూడో సీజ‌న్ మాత్రం వార్తల్లోనే వుంటూ వస్తోంది. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని సెట్ మీదకు వెళ్తోంది.

తొలి ఎపిసోడ్ ను రేపు చిత్రీకరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా వస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ నెలాఖరులో విడుదలవుతోంది. దీని నేపథ్యంలో అన్ స్టాపబుల్ తొలి ఎపిసోడ్ గా వీళ్లను పిలిచారు.

కమింగ్ ఎపిసోడ్ ల విషయంలో కూడా చాలా వార్తలు వున్నాయి. బాలయ్య ఇద్దరి అల్లుళ్లు, ఇద్దరు కూతుర్లతో ఓ ఎపిసోడ్ వుంటుందని టాక్ వుంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ ఎపిసోడ్ వుంటుందని కూడా తెలుస్తోంది.

6 Replies to “అన్ స్టాపబుల్ – మళ్లీ మరోసారి!”

  1. “బాలయ్య ఇద్దరి అల్లుళ్లు, ఇద్దరు కూతుర్లతో ఓ ఎపిసోడ్ వుంటుందని టాక్ వుంది”

    any question on 20 lacs jobs?

Comments are closed.